లెజండ్, డిక్టేటర్ తర్వాత మళ్ళీ బాలయ్యతో రొమాన్స్ కి రెడీ అవుతోంది

  • July 24, 2019 / 03:37 PM IST

సీనియర్ హీరోలకి హీరోయిన్ దొరకడం పెద్ద సమస్యగా మారింది. కొత్త హీరోయిన్స్ తో చేద్దామా అంటే వాళ్లేమో మరీ చిన్న పిల్లలా ఉంటున్నారు వారి పక్కన. లేదు కాస్త మధ్య వయస్కులతో చేద్దామంటే ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. దాంతో తమ ఏజ్ కి. లుక్స్ కి సరిపడా హీరోయిన్ ను వెతుక్కోవడం దాదాపుగా అగ్ర కథానాయకులందరికీ పెద్ద సమస్యగా మారింది. నాగార్జున మాత్రమే ఇందుకు మినహాయింపు. ఆయన ఇప్పటికీ కుర్రాడిలానే ఉన్నాడు కాబట్టి ఎవరితో యాక్ట్ చేసినా సెట్ అయిపోతుంది. కానీ.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వాళ్ళకు మాత్రం ఈ తిప్పలు తప్పడం లేదు.

ఇప్పుడు బాలయ్య తాను కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం విషయంలో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా చాలామంది పేర్లు అనుకొన్నప్పటికీ.. చివరికి “లెజండ్, డిక్టేటర్” చిత్రాల్లో తనకు జోడీగా నటించిన సోనాల్ చౌహాన్ ను ఫిక్స్ అయ్యాడట. అమ్మడు బాలయ్య పక్కన సెట్ అవ్వడమే కాక గ్లామరస్ గానూ ఉంటుంది కాబట్టి ఆమెను ఫిక్స్ అయ్యాడు బాలయ్య. సోనాల్ చౌహాన్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూ ఈ చిత్రంలో ఆస్కారం ఉంది. మరి ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus