బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ పై ఎప్పటి నుండో ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. నెటిజెన్స్ టార్గెట్ చేసే వారిలో హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ కూడా ఒకరు. సోనమ్ పై ఆమె చిత్రాలపై నెటిజెన్స్ వీలు దొరికినప్పుడల్లా నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత ఆమెపై సోషల్ మీడియా దాడి ఎక్కువైంది. తాజాగా ఓ నెటిజెన్ సోనమ్ కపూర్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర కామెంట్స్ చేయడం జరిగింది.
ఆ నెటిజెన్ సోనమ్ ని నేపోటిజం ప్రొడక్ట్ అని పిలవడంతో పాటు, మరీ పోజు కొట్టకు, నీ భర్త ఏమైనా అందగాడు అనుకుంటున్నావా, అంత లేదు, కళ్ళు తెరిచి చూడు ఎంత దరిద్రంగా ఉన్నాడో అర్థం అవుతుందని కామెంట్ పెట్టడం జరిగింది. సాధారణంగా సోనమ్ ట్రోల్స్ కి కూడా స్పందిస్తూ కౌంటర్లు వేస్తూ ఉంటుంది. భర్త గురించి అవమానకరంగా మాట్లాడంతో సోనమ్ ఆ నెటిజెన్ కి సమాధానం ఇచ్చింది. నీవు ఇప్పుడు ఇలా కామెంట్ చేయడం వలన నీ ఫాలోవర్స్ పెరగాలి, అంతే కదా..
ఇదిగో నీవు కోరుకున్నదే చేస్తున్నాను అంటూ నెటిజెన్ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆనంద్ అహుజాపై అవమానకర కామెంట్ చేయడంతో సోనమ్ ఆ స్థాయిలో మండిపడ్డారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!