Sonu Sood: నేషనల్ లాంగ్వేజ్ ఇష్యూపై సోనూసూద్ కామెంట్స్!
April 29, 2022 / 02:23 PM IST
|Follow Us
కన్నడ స్టార్ సుదీప్ ఇటీవల ‘కేజీఎఫ్2’ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ఇకపై హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదని అన్నారు. దీనిపై అజయ్ దేవగన్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదన్నప్పుడు.. మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో సుదీప్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తను అన్ని భాషలను గౌరవిస్తానని అన్నారు. దీనిపై అజయ్ దేవగన్ రియాక్ట్ అవుతూ.. తప్పుగా అర్ధం చేసుకున్నానని అన్నారు.
మేటర్ తెలియకుండా వెంటనే మాట్లాడకూడదని సూచించారు సుదీప్. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ హాట్ టాపిక్ గా మారింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై మాట్లాడారు. సౌత్ స్టార్స్ ను చూస్తూ నార్త్ స్టార్స్ అసూయ పడుతున్నారని అన్నారు. తాజాగా నటుడు సోనూసూద్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం ఒకే భాష ఉందని.. అదే ఎంటర్టైన్మెంట్ అని అన్నారు. నువ్ ఏ సినిమా పరిశ్రమ నుంచి వచ్చావనేది అనవసరమని..
కానీ నువ్ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే చాలు.. వారు నిన్ను ఆదరిస్తారని అన్నారు. అదే విధంగా దక్షిణాది సినిమాల ప్రభావం మాత్రం ఫ్యూచర్ లో హిందీ సినిమాలపై ఉంటుందని అన్నారు. అలానే.. ప్రేక్షకుడి అభిరుచుల్లో కూడా కొంత మార్పు వచ్చిందని.. వారు ప్రతి సినిమాలోనూ కంటెంట్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. ఓ యావరేజ్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తమ వేల రూపాయలను ఖర్చు చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
ఇక సోనూసూద్ సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు. అలానే ఈరోజు విడుదలైన ‘ఆచార్య’ సినిమాలో విలన్ గా కనిపించారు సోనూసూద్.