Sonu Sood: చిరంజీవి ఆక్సిజన్ పంపిణీపై సోనూసూద్ రియాక్షన్

  • June 8, 2021 / 01:49 PM IST

గత ఏడాది నుంచి తీరిక లేకుండా కోవిడ్ బాధితులకు ఎంతగానో సహాయం చేసిన సోనూసూద్ అప్పటి నుంచి అదే తరహాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు ఎంత పెరుగుతున్నా కూడా తన సహాయలను ఏ మాత్రం ఆపడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎవరు చేయని విధంగా ఈ స్టార్ యాక్టర్ వేలాది మందికి సహాయ పడ్డాడు. అలాగే అతను చేసే ప్రతి మంచి పని కూడా మీడియాలో హైలెట్ అవుతూ వచ్చింది.

ఇక రీసెంట్ గా సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్స్ స్థాపించి కోవిడ్ రోగులకు ఊపిరిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ను రెండు రాష్ట్రల వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ అనేది ప్రతి జిల్లాలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇక ఆ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి గారు , రామ్ చరణ్ ఇద్దరు కూడా ఆక్సిజన్ ను అవసరం ఉన్న వారికి చెరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు అంటూ.. ఆ గొప్ప పని గురించి తెలుసుకోగానే నాకు చాలా సంతోషం కలిగిందని సోనూసూద్ పాజిటివ్ గా స్పందించారు. దీంతో సోనూసూద్ పై మెగా ఫ్యాన్ మరోసారి పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. సోనూసూద్ ముందు నుంచి కూడా సహాయం చేయడానికి ఇతర సెలబ్రెటీలు వస్తే జనాలకు మరింత మంచి జరుగుతుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus