తన సోదరి మాళవికా సూద్ సచార్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, బాలీవుడ్ నటుడు సోనూసూద్ అధికారికంగా తెలియజేశాడు. ఇక ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. సరైన సమయంలో పార్టీ గురించి వెల్లడిస్తామని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు సేవ చేసేందుకు తన సోదరి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. మోగాలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో సోనూసూద్ మాట్లాడుతూ..
ప్రజలకు సేవ చేయడంలో మాళవిక నిబద్ధత అసమానమని అంటూ.. తాను ఇటీవల ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని కలిశానని, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ వంటి ఇతర రాజకీయ నేతలను కలవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలో చేరడం అనేది జీవితంలో ఒక పెద్ద నిర్ణయమని, ఇందులో ప్రజలను కలవడమే కాకుండా సిద్ధాంతాలపై నమ్మకం ఉంటుందని సోనూసూద్.
తన సోదరి మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, ఆమె ప్రాధాన్యత ఆరోగ్య సంరక్షణ మరియు నిరుద్యోగం అని నటుడు చెప్పాడు. మాళవిక ఎన్నికైతే, డయాలసిస్ అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తామని కూడా ఆయన తెలిపారు. ఇక మొదట సోనూసూద్ రాజకోయల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ సోనూసూద్ మొదట తన సోదరిని రంగంలోకి దింపడం విశేషం.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!