Salaar Movie: ‘సలార్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 13, 2023 / 07:52 PM IST

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ ‘ పేరుతో రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్స్ పర్వాలేదు అనిపించాయి. డిసెంబర్ 22 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తాజాగా ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ ‘ నుండి ‘సూరీడే’ అనే లిరికల్ సాంగ్ రిలీజయ్యింది.

ఇక ‘సూరీడే’ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 19 సెకన్ల నిడివి కలిగి ఉంది. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటకు సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన ట్యూన్ బాగానే ఉంది. కానీ ఎక్కడో ‘కె.జి.ఎఫ్’ ను గుర్తు చేస్తూ సాగింది అని చెప్పాలి. కానీ కృష్ణ కాంత్ లిరిక్స్ బాగున్నాయి. ‘సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజముతట్టి..

చిమ్మ చీకటిలోను నీడలా ఉండేటోడు’ అనే లిరిక్స్ ను బట్టి వర్ద(పృథ్వీరాజ్ సుకుమారన్) కి దేవా(ప్రభాస్) ధైర్యం చెబుతూ అండగా నిలబడ్డ టైంలో ఈ పాట వస్తుంది అని తెలుస్తుంది. హరిణి వైతూరి పాడిన విధానం బాగుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్.. లు ప్రాణ స్నేహితులుగా కనిపిస్తున్న ఈ పాటలో వారి మధ్య బ్రొమాన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని విజువల్స్ చెబుతున్నాయి. ఒకసారి ఈ లిరికల్ సాంగ్ (Salaar)ను మీరు కూడా చూస్తూ వినండి :

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus