Sowmya Rao: జబర్దస్త్ యాంకర్ మారడం వెనుక ఇంత స్టోరీ ఉందా?

  • December 14, 2023 / 05:51 PM IST

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం గత 14 సంవత్సరాలుగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అయితే ఈ కార్యక్రమంలో ఎంతోమంది కంటెస్టెంట్ రావడం జడ్జెస్ కూడా మారడం అలాగే యాంకర్లు కూడా మారడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొదట్లో అనసూయ యాంకర్ గా వ్యవహరించేవారు. అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకొని సినిమా అవకాశాలు అందుకోవడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి

దీంతో ఈమె వెండితెరపై బిజీగా మారడంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ఇక అనసూయ వెళ్ళిపోవడంతో కన్నడ సీరియల్ నటి సౌమ్యరావును ఈ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకోవచ్చారు. ఈమె కూడా వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అంతే విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఉన్నఫలంగా సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఈ విధంగా సౌమ్యరావు (Sowmya Rao) ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో తిరిగి బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయినటువంటి సిరి హనుమంతు ఈ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చారు. అయితే సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఈ విషయంపై తాజాగా ఒక నెటిజన్ ఆమెను నేరుగా ప్రశ్నించారు అయితే సౌమ్యరావు జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి కారణాలను తెలుపుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి సరైన కారణం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలని సరైన టైమ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి బయట పెడతాను అంటూ ఈమె కామెంట్ చేయడంతో ఈమె బయటకు వెళ్లడం వెనుక ఏదో గూడు పుఠాణి జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే ఈమెను బయటకు పంపించారు అంటూ ఈమె మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతుంది. మరి మల్లెమాలవారు ఈమెని ఎందుకు బయటకు పంపించారో తెలియాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus