ఇప్పటవరకూ ఎవరు చూడని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రేర్ ఫోటో గ్యాలరీ!
June 4, 2022 / 08:40 PM IST
|Follow Us
గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రమణ్యం మరణ వార్త యావత్ సినీ ప్రపంచనాన్ని శోకసంద్రంలో ముంచేసింది. దాదాపు నలభై రోజులు పై నుండీ కరోనాతో పోరాడుతూ వచ్చిన ఆయన ఈ శుక్రవారం(ఈరోజు) మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో మరణించారు. ఆగష్ట్ మొదటి వారం నుండీ ఆయన చెన్నైలోని ఎం.జి.ఎం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అప్పటి నుండీ ఈయన ఆరోగ్యం గురించి అనేకనేక వార్తలు వచ్చాయి. ఒకరోజు ఆయన కోలుకున్నారని.మరొకరోజు ఆయన ఆరోగ్యం మళ్ళీ విషమించిందని… ఇలా రకరకాల ఊహాగానాలు.నిన్నటి వరకూ బాలు కోలుకుంటారు అని ఆశలు పెట్టుకున్నవారికి ఈరోజు ఆయన మరణవార్త వినగానే పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.తమ అభిమాన గాయకుడు ఇక లేడు అనే విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేక కనీళ్ళు పెట్టుకుంటున్నారు.
1946 జూన్ 4న ఉత్తర ఆర్కాడు జిల్లా (తిరువళ్ళూరు జిల్లా, నెల్లూరు కు దగ్గర ప్రాంతం) లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు బాలసుబ్రహమణ్యం.ఈయన తండ్రి హరికథా కళాకారుడు కావడం వల్ల బాలుగారికి చిన్నప్పటి నుండే సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది. ఈయన మద్రాసులో ఇంజనీరింగ్ చదువు చదువుకున్నాడు. ఆ టైంలోనే స్టేజి పై పాటలు పాడడం అలవాటు చేసుకున్నారు బాలు. 1966 లో పద్మనాభం నిర్మాణంలో వచ్చిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సింగర్ గా పరిచయమయ్యారు బాల సుబ్రహ్మణ్యం.ఆయన ట్యాలెంట్ చూసి అవకాశాలు ఆయన తలుపు తట్టాయి. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ,హిందీ,మలయాళం, కన్నడ భాషల్లోని సినిమాల్లో ఈయన పాటలు పాడారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్.. వంటి స్టార్లకు డబ్బింగ్ కూడా చెప్పారు బాలు. నటుడిగా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పర్సనల్ లైఫ్ విషయాలకు వస్తే.. ఆయన భార్య పేరు సావిత్రి. ఈయనకి ఇద్దరు సంతానం. కొడుకు చరణ్.. సింగర్ గా అందరికీ సుపరిచితమే. ఇక బాలుగారి కుమార్తె పేరు పల్లవి. ఇక బాలు గారి సోదరి ఎస్.పి.శైలజ కూడా పాపులర్ సింగర్ అన్న సంగతి తెలిసిందే. ఈమె ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహం చేసుకుంది. బాలు గారి ఫ్యామిలీ గురించి బయట ఎక్కువగా వార్తలు వచ్చేవి కావు. ఇదిలా ఉండగా.. మన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఇప్పటి వరకూ మనం చూడని కొన్ని రేర్ అండ్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :