బాలు ఆరోగ్యంపై ఉపశమనం కలిగించే న్యూస్..!

  • August 26, 2020 / 01:39 PM IST

మూడు వారాలకు పైగా లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా సోకిన కారణంగా ఎస్పీ బాలు ఎంజిఎం ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఐతే అడ్మిట్ అయిన వారం రోజుల తరువాత ఆయన పరిస్థితి విషమంగా మారింది. దీనితో ఆయనను ఐ సీ యూకి చేర్చడంతో పాటు, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. బాలు ఆరోగ్యంపై సినీ ప్రముఖులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

దీనితో బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ప్రతి రోజు ఆయన ఆరోగ్యంపై అప్డేట్స్ ఇస్తున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం ఎస్పీ చరణ్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బాలు ఆరోగ్యంపై తాజా పరిస్థితి వివరించడం జరిగింది. గతంతో పోల్చుకుంటే కొంచెం ఉపశమనం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. బాలు డాక్టర్స్ కి మరియు చికిత్సకు స్పందిస్తునట్లు చెప్పారు.

మూడు రోజులుగా బాలు ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉందని చెప్పిన ఆయన నేడు చికిత్సకు స్పందిస్తున్నారు అని చెప్పడం గమనార్హం. దీనితో బాలు త్వరలోనే కోలుకొని తిరిగి వస్తారన్న నమ్మకం బలపడింది. ఇక తను ఇంగ్లీష్ లో చెప్పడానికి కారణం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ కి అర్థం కావాలని చెప్పారు.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus