Priyamani: ప్రియమణి భర్తతో కలిసి లేదా..? ఇదిగో క్లారిటీ!

  • October 20, 2022 / 12:06 PM IST

టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో ఆమె రోల్ క్లిక్ అవ్వడంతో ప్రియమణి డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ లో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే నాగచైతన్య-వెంకట్ ప్రభు సినిమా సైన్ చేసింది. మరోపక్క టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రియమణి మ్యారీడ్ లైఫ్ గురించి కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

తన భర్త ముస్తాఫా రాజ్ తో ఆమె కలిసి జీవించడం లేదని కొన్ని మీడియా వర్గాల్లో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా కొంతవరకు ప్రచారం జరిగింది. ముస్తాఫాకు ఇది రెండో పెళ్లి. ఇదివరకే అయేషా అనే మహిళతో అతడికి వివాహం జరిగింది. కొన్నాళ్లక్రితం అయేషా.. ముస్తాఫా తనను తన బిడ్డలను పట్టించుకోవడం లేదంటూ మీడియాకెక్కింది. అంతేకాదు.. ప్రియమణితో ముస్తాఫా వివాహం చెల్లదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సమయంలో ప్రియమణి తన భర్తకు అండగా నిలిచింది.

అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ కలిసి జీవించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ప్రియమణి టీమ్ కొట్టిపారేసింది. ప్రియమణి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన భర్త పేరుని కూడా తొలగించలేదు. అంతేకాదు.. రీసెంట్ గా ‘రాకెట్రీ’ సినిమా టీమ్ సక్సెస్ పార్టీకి తన భర్తను తీసుకొని వెళ్లింది ప్రియమణి.

దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. ప్రియమణి, ముస్తాఫా రాజ్ కలిసే ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే మరొక ప్రూఫ్ అక్కర్లేదు. కనీసం ఇప్పటికైనా.. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus