స్పైడర్ తో సూపర్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు!

  • September 28, 2017 / 07:09 AM IST

మహేష్ బాబు కోలీవుడ్ లోకి గట్టిగానే ఎంట్రీ ఇచ్చారు. అక్కడి స్టార్ డైరక్టర్ మురుగదాస్ తో ద్వి భాష చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏడాది పాటు కష్ట పడి స్పైడర్ లాంటి మంచి సినిమాని అందించారు. ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. కేవలం చెన్నై సిటీలోనే స్పైడర్ తమిళ వెర్షన్ 46 లక్షలు గ్రాస్ వసూలు చేయగా, తెలుగు వెర్షన్ 16 లక్షల గ్రాస్ రాబట్టింది. దీంతో మహేష్ కి మంచి స్వాగతం లభించినట్టేనని అక్కడి ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

ఫస్ట్ డే సిటీలో 64 లక్షల గ్రాస్ రావడమంటే మామూలు విషయం కాదని వివరించారు. ఓవర్సీస్ లో ఊహించిన దానికంటే స్పైడర్ కి మంచి ఆదరణ లభించింది. ప్రీమియర్ల ద్వారా దాదాపు 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ ఫస్ట్ డే కలక్షన్స్ అధికార ప్రకటనపై అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus