తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు కుమార్తె కంటమనేని ఉమా మహేశ్వరి సోమవారం నాడు హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎన్టీఆర్- బసవతారకం దంపతులకు ఈమె నాలుగో కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పటికీ ఎన్నో తీరని విషాదాలు చాలా చోటుచేసుకున్నాయి.
ఎన్టీఆర్- బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం. వాళ్ళే జయ కృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి.
ఎన్టీఆర్ వారసుల్లో కొంత మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, నందమూరి ఫ్యామిలీ కూడా లీడింగ్ లో ఉంది అనుకుంటున్న తరుణంలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే 4 ఏళ్లకు ఒకరు అన్నట్టు నందమూరి ఫ్యామిలీలో మరణ వార్తలు వినిపిస్తున్నాయి.
2014 లో హరికృష్ణ గారి అబ్బాయి, ఎన్టీఆర్ మనవడు అయిన జానకి రామ్ మరణించాడు. 2018 లో హరికృష్ణ గారు మరణించారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక తాజాగా 2022 లో ఉమా మహేశ్వరి మరణించారు.
గతంలోకి వెళితే ఎన్టీఆర్ కుమారుడు సాయి కృష్ణ 2004లో మరణించారు. ఇక ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ అయితే అతని చిన్నప్పుడే మరణించడం జరిగింది.
ఇదిలా ఉండగా.. కంటమనేని ఉమా మహేశ్వరి గారి అంత్యక్రియలు బుధవారం నాడు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరు కాబోతున్నారు.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?