Sr NTR, Chiranjeevi: చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ వెనుక ఇంత కథ ఉందా?
August 29, 2022 / 01:00 PM IST
|Follow Us
ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దేవి వరప్రసాద్ చిరంజీవితో ఎక్కువ సినిమాలను నిర్మించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే వరకు ఆయనతో సినిమాలను నిర్మించిన ఈ నిర్మాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవితో సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపారు. ఘరానా మొగుడు సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ చిరంజీవితోనే సినిమా తీయాలని ఆయన ఎంతోకాలం పాటు ఎదురు చూశారు. రెండున్నర సంవత్సరాల పాటు ఎదురుచూసి చిరంజీవి ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్ లో దేవి వరప్రసాద్ అల్లుడా మజాకా సినిమాను నిర్మించారు.
చిరంజీవి ఈవీవీ కాంబినేషన్ లో వచ్చిన ఏకైక సినిమా కూడా ఇది మాత్రమే కావడం గమనార్హం. అప్పుల అప్పారావు సినిమా వల్ల ఈవీవీ సత్యనారాయణకు అల్లుడా మజాకా సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కడం గమనార్హం. పోసాని కృష్ణమురళి ఈ సినిమాకు కథకుడు కాగా మొదట ఈ సినిమాలో అత్త పాత్రకు వాణిశ్రీ పేరును పరిశీలించి ఆమె డేట్లు కుదరకపోవడం వల్ల సీనియర్ హీరోయిన్ లక్ష్మీని ఈ సినిమాలో ఎంపిక చేయడం జరిగింది.
రమ్యకృష్ణ, రంభ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. 1994 సంవత్సరం ఆగష్టు 26వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ తో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చిరంజీవి రంభ హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ కు దేవీ వరప్రసాద్ సన్నిహితుడు కాగా ఆ కారణం వల్లే ఈ సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టడానికి అంగీకరించారు.
1995 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం. చిరంజీవి అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.