ఆ సినిమా చూశాక ‘దీపావళి’ మీద నమ్మకం పెరిగింది: స్రవంతి రవి కిషోర్‌

  • November 9, 2023 / 01:24 PM IST

కొంతమంది పుట్టుకతో హీరోలు, కొన్ని కథలు పుట్టుకతో హిట్లు అని అంటుంటారు. ఎందుకో, ఏమో తెలియదు కానీ అలా అనిపించేస్తాయి అంతే. అలాగే కొన్ని సినిమాలు ఆలోచన రాగానే అవార్డులు వస్తాయి అనే ఆలోచన వచ్చేస్తుంది. అలాంటి ఓ సినిమానే ‘బలగం’. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే అవార్డులు పక్కా అని చెప్పారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా వివిధ అవార్డులు గెలుచుకుంది. ఒకటి కాదు, రెండు కాదు వందకు పైగా పురస్కారాలు వచ్చాయి.

ఇప్పుడు అలాంటి ఫీల్‌ కలిగిస్తున్న మరో చిత్రం ‘దీపావళి’. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఇలాంటి ఫీలింగ్‌ కలిగించింది. కొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అయింది కూడా. తమిళంలో తెరకెక్కిన ‘కిడ’ సినిమాకు తెలుగు అనువాదం ‘దీపావళి’. రాము, కాళీ వెంకట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆర్‌.ఎ.వెంకట్‌ దర్శకుడు. ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత స్రవంతి రవి కిషోర్‌ (Sravanthi Ravi Kishore) మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మనకి సంక్రాంతి ఎలాగో, అలా తమిళనాడు ప్రజలకి దీపావళి అలాగా. అందుకే ‘దీపావళి’ని అప్పుడు రిలీజ్‌ చేస్తాం అని చెప్పారు. తమిళనాడు, చిత్తూరు సరిహద్దుల్లో సాగే కథ ఇది అని చెప్పారు. కరోనా తర్వాత భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. అన్ని భాషల సినిమాల్నీ సమానంగా ఆదరిస్తున్నారు అందుకే ఈ సినిమాను రెండు భాషల్లో రిలీజ్‌ చేస్తున్నాం అని చెప్పారు. ‘బలగం’ సినిమా సాధించిన విజయాన్ని చూసిన తర్వాత ‘దీపావళి’ సినిమాపై మరింత నమ్మకం పెరిగింది అని రవికిషోర్‌ చెప్పారు.

ఇక స్రవంతి మూవీస్‌ నుండి ఒకప్పుడు వరుసగా సినిమాలొచ్చేవి, ఇప్పుడు తగ్గాయి అని అడిగితే… నిర్మాతగా తాను అన్ని రకాల సినిమాలూ తీయాలనుకుంటానని చెప్పారు. అయితే వరుస సినిమలు తీయాలంటే డబ్బుంటే చాలనే దృక్పథంతోనే ఇన్నాళ్లూ చేశానని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ శాటిలైట్‌, ఓటీటీ మార్కెట్‌ నుంచి ఎక్కువగా డబ్బు రావడం లేదు అని తెలిపారు. అందు వల్లే తమ సినిమాల్లో వేగం తగ్గిందని చెప్పారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus