శ్రీముఖి సినిమాలు వదిలెయ్యడానికి కారణం అదే…!

  • April 10, 2020 / 03:05 PM IST

‘పటాస్’ షోతో పాపులర్ అయిన శ్రీముఖి… సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వరుసగా షో లు చేస్తూ… ఈవెన్ట్ లు చెట్టు ఈ రాములమ్మ చాలా బిజీగా ఉంది. గతేడాది ‘బిగ్ బాస్3’ లో ఈమె ఎంట్రీ ఇచ్చి చివరి వరకూ ఓ రేంజ్ లో అలరించింది. విన్నర్ అయితే అవ్వలేదు కానీ.. రన్నర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈమె కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ‘జులాయి’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘బాబు బాగా బిజీ’ అంటూ పలు చిత్రాల్లో నటించింది. అయితే తరువాత ఈమె సినిమాలు చెయ్యడం మానేసింది.

అసలు ఎందుకు సడన్ గా మానేసింది అనే విషయం పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..’జులాయి’ సినిమాలో చేస్తున్నప్పుడే నాన్నగారు సినిమాలు చెయ్యొద్దు అని గట్టిగా చెప్పారు. ఆ సినిమానే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ చిత్రం అవ్వాలని ఆర్డర్ వేశారు. అయినా ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి అని రెండు మూడు సినిమాలు చేశాను. ఆ తర్వాత పూర్తిగా మానేశాను. మెల్లగా టీవీ షోలు చేయడం మొదలుపెట్టాను.

ఆ టైమ్‌లో త్రివిక్రమ్‌గారు నాకు ఓ సలహా కూడా ఇచ్చారు. నీవు ఎక్కువగా టీవీ షోలు చేస్తే సినిమా అవకాశాలు రావని చెప్పారు. ఆయన అన్నట్లుగానే జరిగింది. అయితే నేను టీవీ షోలు స్టార్ట్ చేసినప్పుడు రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. చిన్న సినిమాలే అయినా వాటిలో నా పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం… అందులోనూ ఎక్స్‌పోజింగ్, లిప్‌లాక్‌లు ఎక్కువ చేయాలని దర్శక నిర్మాతలు అడగడంతో.. అవి మనవల్ల కాదనుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసాను. టీవీ షోలలో బిజీ అవ్వడంతో ఆ తర్వాత సినిమాల గురించి పట్టించుకునేంత టైమ్ కూడా లేదు..” అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus