Sree Vishnu, Nani: టికెట్ రేట్ల ఇష్యు పై మరోసారి శ్రీవిష్ణు కామెంట్స్..!
December 29, 2021 / 09:43 PM IST
|Follow Us
ఏపి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పై పగ సాధించడం మొదలు పెట్టిందని.. ఇప్పటికే పలు సంఘటనల ద్వారా ప్రూవ్ అయ్యింది. మొదట టికెట్ రేట్లు మాత్రమే తగ్గించిన ఏపి ప్రభుత్వం.. ఈ విషయం పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోర్టు మెట్లెక్కడంతో.. అప్పీల్ కు వెళ్ళి థియేటర్లను సీజ్ చేస్తూ కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుంది. ఈ విషయం పై స్పందించిన నాని పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ కావాల్సిన 100 కి పైగా థియేటర్లను సీజ్ వారి కోపాన్ని కూడా చూపిస్తున్నారు. దాంతో హీరోలు ఇప్పట్లో ఈ ఇష్యు పై మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా యువ హీరో శ్రీవిష్ణు టికెట్ రేట్ల ఇష్యు పై అసహనం వ్యక్తం చేసి పరోక్షంగా నానికి మద్దతు పలికాడు. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఏపిలో జనాలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోయాయి.
వాటిని తగ్గేస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది. అంతేకాని సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తే సామాన్యుడికి వినోదం అందుతుందని అనుకోవడం చాలా తప్పు. సినిమా అనేది వాళ్ళ పర్సనల్ విషయం. రేట్లు తగ్గించినా, పెంచినా వచ్చే ప్రేక్షకులు వస్తారు. రేట్లు తగ్గినంత మాత్రాన కొత్తగా ఎవరు రారు. ఉన్నఫలంగా టికెట్ రేట్స్ తగ్గిస్తే, పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి?. ఇక మీద సినిమాలు చేయాలంటే టికెట్ రేటును దృష్టిలో పెట్టుకొని చేయాల్సివస్తుంది. నా ‘రాజ రాజ చోర’ సినిమాకి ఆంధ్రలో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి” అంటూ చెప్పుకొచ్చాడు.