Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీలే నంబర్ వన్ అంటున్న ఫ్యాన్స్.. రీజన్స్ ఇవే!

  • May 6, 2023 / 07:45 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తోంది. శ్రీలీల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా శ్రీలీల స్థాయిలో ఆఫర్లు ఉన్న హీరోయిన్లు మాత్రం లేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీల వరుస షూటింగ్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఆమె డేట్స్ ఇస్తే సండే సమయంలో, నైట్ సమయంలో షూట్ చేయడానికి కూడా మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీలో శ్రీలీల ఒక హీరోయిన్ గా ఎంపికయ్యారని తెలుస్తోంది.

ఈ సినిమాలో నటిస్తున్న యంగ్ హీరోకు జోడీగా ఈ బ్యూటీ కనిపిస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకే సమయంలో పోటీ పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కౌంట్ పరంగా శ్రీలీల నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. శ్రీలీలకు గట్టి పోటీ ఇచ్చే హీరోయిన్ కూడా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల పారితోషికం కోటి రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల ఈ స్థాయికి చేరుకోవడం కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. శ్రీలీల రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుని విజయవంతంగా కెరీర్ ను కొనసాగించడంతో పాటు ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శ్రీలీల సైతం వచ్చిన ప్రతి భారీ ఆఫర్ కు ఓకే చెబుతూ ఆయా హీరోల అభిమానులను సైతం ఆకట్టుకుంటున్నారు.

శ్రీలీల (Sreeleela) రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ శ్రీలీల, బన్నీ శ్రీలీల కాంబినేషన్లలో సినిమాలు వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతి స్టార్ హీరోకు జోడీగా నటించాలని శ్రీలీల భావిస్తున్నట్టు బోగట్టా. శ్రీలీల కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుండగా ఆమె కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని సమాచారం అందుతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus