Sreeleela: ఆ టాలెంటెడ్ హీరోకు నో చెప్పిన శ్రీలీల.. ఏం జరిగిందంటే?

  • June 9, 2023 / 08:23 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. శ్రీలీల ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే శ్రీలీలకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ కు జోడీగా నటించే అవకాశం రాగా శ్రీలీల నో చెప్పారని తెలుస్తోంది. విశాల్ సినిమాను శ్రీలీల రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుండగా ఈ కామెంట్లపై శ్రీలీల ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు డేట్లు కేటాయించలేని పరిస్థితిలో శ్రీలీల ఉన్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆదివారం సెలవు దినంగా ఉంటుంది. అయితే శ్రీలీల మాత్రం ఆదివారం రోజున కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది. శ్రీలీల రేంజ్ ను తర్వాత సినిమాలు పెంచుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల పారితోషికం కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తారంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. శ్రీలీల రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో కూడా సత్తా చాటే అవకాశం ఉంటుంది. శ్రీలీల రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

కథ నచ్చితే సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి కూడా శ్రీలీల ఓకే చెబుతున్నారు. శ్రీలీలకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శ్రీలీలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus