Skanda: స్కంద సినిమాను మిస్ చేసుకుని బాధపడుతున్న స్టార్ హీరోయిన్!

  • September 29, 2023 / 04:28 PM IST

దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రామ్. సినిమా సినిమాకు తన నటనలో వైవిధ్యం చూపిస్తూ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు. కథ నచ్చితే ఎంతైనా కష్టపడే రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా స్కంద. ఆయన ఈ సినిమా కోసం ఏకంగా 12కిలోల బరువు పెరిగారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఫస్ట్ షోతోనే సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.

బోయపాటి మాస్.. రామ్ బీభత్సమైన మాస్ లుక్ జనాలకు తెగ నచ్చేశాయి. యంగ్ ఎనర్జిటిక్ రామ్ పవర్ ఫుల్ డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయ్. కాగా ఈ సినిమాలో రామ్ సరసన టాలీవుడ్ క్రష్ శ్రీలీల నటించింది. వాస్తవానికి శ్రీ లీల పాత్రలో మొదటగా దర్శకుడు బోయపాటి శ్రీను రష్మిక మందన్నాను అనుకున్నారట. కానీ అమ్మడు ఈ పాత్ర టూ మాస్ గా ఉండడం.. అంతేకాకుండా రామ్ హీరో కావడంతో తన కంత సీన్ లేదనుకుని..

ఎక్కడ సినిమా (Skanda) ఫ్లాప్ అవుతుందోనన్న భయంతో రిజెక్ట్ చేసిందట. అయితే అమ్మడు అంచనాలన్నీ తారు మారు చేస్తూ.. తన ఆలోచన తప్పని రుజువని నిరూపిస్తూ సినిమా సూపర్ హిట్ అయింది. ట్రైలర్ చూసిన జనాలకు అందులో ఆ ఓవర్ మాస్ అప్పిరియన్స్ చూసి అప్పటివరకు సినిమా ఎత్తేస్తదేమోనన్న కాస్త భయం మనసులో ఉండి పోయింది. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రష్మిక మందన్నా కూడా తాను మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానే అంటూ తెగ బాధపడిపోతుందట.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus