హంటర్ రీమేక్ లో శ్రీముఖి..!!

  • August 1, 2016 / 10:13 AM IST

బాలీవుడ్ అడల్ట్ హిట్ మూవీ “హంటర్” ను తెలుగులో రీమేక్ చేయటానికి అంత సిద్ధమైంది. కూల్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రం లో సెక్స్ ఎడిక్ట్ గా నటిస్తున్నాడు. అతనికి జోడీగా రెజీనా అందాలు ఆరబోయనుంది. ఈ సినిమాలో యాంకర్, నటి శ్రీముఖి కీలక పాత్రలో కనిపించనుంది. “ఈ సినిమాలో నాకు డిఫరెంట్ రోల్ లభించడం ఆనందంగా ఉంది.

ఆ పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఉన్నాను. హిందీ వెర్షన్ ని నేను చూడలేదు. కానీ బాగా రావడానికి కష్టపడుతాను” అని శ్రీముఖి చెప్పింది. బాట్ మాన్ డార్క్ నైట్, ఐరన్ మాన్ , 2012 వంటి హిట్ హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్ గా పనిచేసిన నవీన్ మేడారం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ” శ్రీముఖి మంచి నటి. ఆమె ది హంటర్ లో క్రూషియల్ రోల్. హీరో కాలేజీ చదివేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయనుంది.

ఆ పాత్రకు శ్రీముఖి పూర్తి న్యాయం చేయగలదని భావిస్తున్నా” అని అన్నారు. పటాస్ షోలో అడల్ట్ కామెడీతో నవ్విస్తున్న శ్రీ ముఖి, రీసెంట్ గా యాంకర్ రవి తో కలిసి “మిత్రమా” అనే షార్ట్ ఫిలిం ద్వారా తనలోని నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. వచ్చే వారంలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో ఏ విధంగా ఆకట్టుకోనుందో వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus