తమిళంలో తెలుగమ్మాయి కష్టాలు!

  • June 28, 2016 / 12:55 PM IST

మన తెలుగమ్మాయిలు ఇక్కడ కంటే తమిళంలోనే మంచి పేరు తెచ్చుకొని అక్కడ రాణిస్తుంటారు. హీరోయిన్ శ్రీదివ్య కూడా అంతే. తెలుగులో ఈ భామకు అవకాశాలు అంతంతమాత్రం గానే ఉండేవి. దీంతో కోలీవుడ్ కు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ భామకు తమిళంలో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. నిన్నమొన్నటి వరకు లీడ్ హీరోయిన్ పాత్రల్లో మెరిసిన శ్రీదివ్యకు సెకండ్ హీరోయిన్ ఛాన్సులు వస్తున్నాయంట. దీనికి ఓ కారణం ఉంది.

శ్రీదివ్య, కార్తీ హీరోగా నటిస్తోన్న ‘కాష్మోరా’ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో నయనతార కూడా ఉండడంతో శ్రీదివ్య స్థాయి పడిపోయింది. దీనికి తోడు అందులో మనీషా యాదవ్ అనే మరో హీరోయిన్ కూడా ఉంది. ఇక అందరూ శ్రీదివ్యను సెకండ్ హీరోయిన్ రోల్ కోసం అప్రోచ్ అవుతున్నారట. దాంతో శ్రీదివ్యకు కోపం వచ్చి.. కాష్మోరా సినిమాలో నాది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు.. ఆ సినిమాలో కార్తీ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర సరసన నేను హీరోయిన్ గా నటిస్తున్నాను. ఆ మాత్రం దానికి నేను సెకండ్ హీరోయిన్ అయిపోతానా.. అని తన కోపాన్ని తెలియజేస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus