బెడ్ టైమ్ స్టోరీస్ అంటే పెద్దవాళ్ళ పేర్లు వాడుకోవడమా
April 4, 2018 / 06:19 AM IST
|Follow Us
పబ్లిసిటీ కోసం ఏమైనా చేసేవాళ్ళు కొందరుంటారు. వాళ్ళకి సిగ్గు, లజ్జ అనేవి ఇసుమంతైనా ఉండవు. తమవైపు అటెన్షన్ మరల్చుకోవడం కోసం ఎంతటి హేయమైన పనైనా నిర్లజ్జగా చేసేస్తుంటారు. ఇప్పుడు శ్రీరెడ్డిని చూస్తుంటే అదే భావన కలుగుతోంది. మొదట్లో తాను మోసగింపబడ్డాను, అందరూ తనను వాడుకోని అవకాశాలిస్తామని ఆశజూపి తన జీవితంతో ఆడుకొన్నారంటూ యూట్యూబ్, టీవీ చానల్స్ కి వెళ్ళి మరీ గోల చేసిన శ్రీరెడ్డి అదృష్టం తేజ రూపంలో తలుపు తట్టి “ఎన్టీఆర్, ఆటా నాదే వేటా నాదే” చిత్రాల్లో నటించే అవకాశం సొంతం చేసుకొంది. అంతటితో ఇక ఈ నీచమైన రచ్చకి తెరపడింది అనుకొన్నారు అందరూ.
కానీ.. తేజ పిలిచి మరీ అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన తర్వాత కూడా శ్రీరెడ్డికి పబ్లిసిటీ పిచ్చ తగ్గలేదు. సరికదా ఇంకాస్త పెరిగినట్లు అనిపిస్తోంది. ఇటీవల అమ్మడు శేఖర్ కమ్ముల పేరు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆయనను ఉద్దేశించి ఒక ఫేస్ బుక్ పోస్ట్ పెట్టింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ రొచ్చులో శేఖర్ కూడా ఉన్నాడా అని ఆయన వీరాభిమానులు బాధపడే స్థాయిలో సదరు పోస్ట్ ఉంది . దాంతో శేఖర్ కమ్ముల రెస్పాండ్ అయ్యి ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసిందుకు క్షమాపణ చెప్పాలని నిలదీయగా.. తోక ముడిచిన శ్రీరెడ్డి “నేనేదో నా అభిమానుల కోసం బెడ్ టైమ్ స్టోరీస్ రాసుకున్నాను శేఖర్ గారు. అయినా మీరేం చేయలేదుగా ఎందుకీ లొల్లి” అని ఒక క్షమాపణ తరహాలో ఒక వెటకారపు పోస్ట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేసింది. డిలీట్ చేసిన కొద్ది సమయంలో ఫేస్ బుక్ లైవ్ స్టార్ట్ చేసి “నేనేదో సరదాగా అన్నాను, ఆ మాత్రానికే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లుగా ఎందుకు ఆ స్టేట్ మెంట్స్” అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుతోంది.
ప్రూఫ్ లు ఉండవు కానీ ఎవరిమీద పడితే వారి మీద కామెంట్ చేస్తాను అంటే ఉరుకునేవారెవరూ లేరు ఇండస్ట్రీలో. అందునా సెన్సిబుల్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల మీద అలాంటి హేయమైన కామెంట్ చేసి “ఏదో సరదాకి” అనడం ఎంతవరకు సబబు. ఈ దరిద్రపుగొట్టు గోల పుణ్యమా అని అర్ధమైన విషయం ఒక్కటే.. శ్రీరెడ్డి కోరుకుంటున్నది అటెన్షన్ సీకింగ్. జనాల నోళ్లలో తన పేరు ఎప్పుడు నానుతూ ఉండాలని కోరుకునే ఆమె ఈ విధంగా బిహేవ్ చేస్తోంది. ఆమె ఈ పిచ్చి చేష్టలు ఎలాగూ మానదు. అందువల్ల జనాలు ఆమెను పట్టించుకోవడం మానేయాలి. మా “ఫిల్మీఫోకస్”లో కూడా శ్రీరెడ్డి గురించి పబ్లిష్ అయ్యే ఆఖరి న్యూస్ ఇది. ఆమె గురించి వార్తలు రాసి అనవసరంగా ఆమెను హైలైట్ చేయాలనుకోవడం లేదు. ప్రజలు కూడా ఈ అటెన్షన్ సీకింగ్ ఫోబియాతో బాధపడుతున్న శ్రీరెడ్డిని పట్టించుకోవడం మానేస్తే మంచిది.