టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నటువంటి వారిలో సంచలన తార శ్రీ రెడ్డి ఒకరు. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె మీటు ఉద్యమం ద్వారా వార్తలలో నిలిచారు. ఈ వివాదం అనంతరం ఈమెపై టాలీవుడ్ ఇండస్ట్రీ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అప్పటినుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ టాలీవుడ్ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
ఈ విధంగా సినీ సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వివాదాల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఈమె తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా శ్రీ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ నిత్యామీనన్ చూడటానికి ఇంతే ఉంటుంది అంటూ కామెంట్స్ చేయగా సమంత గురించి కూడా కామెంట్ చేశారు. సమంత హీరోయిన్ అయినప్పటికీ ఆమె బాడీలో ఏ పార్ట్ టెంప్ట్ చేసే విధంగా ఉండదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. తమన్నా గురించి మాట్లాడుతూ తమన్న చూడటానికి అసలు ఏం బాగుండదు కానీ తన బొడ్డు మాత్రం సూపర్ అంటూ కామెంట్ చేశారు.
ఇక రకుల్ ప్రీతిసింగ్ గురించి మాట్లాడుతూ రకుల్ చూడటానికి అబ్బాయిలా ఉంటుందని అమ్మాయిల ఏ కోశానా కనపడదు అంటూ హీరోయిన్ల గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే హీరోయిన్ల గురించి శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడంతో పలువురు అభిమానులు శ్రీరెడ్డి పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. నువ్వు అసలు చూడటానికి మనిషిలాగే ఉండవు అంటూ ఈమెపై కూడా విమర్శలు కురిపిస్తున్నారు.