ఊహ రీ – ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్..!

  • December 24, 2018 / 01:32 PM IST

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇచ్చి అదరకొడుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో రమ్యకృష్ణ , ఆమని, నదియా, సుహాసిని తదితరులు రీ ఎంట్రీ ఇచ్చి వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తాజాగా మరో సీనియర్ నటి కూడా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

వివరాల్లోకి పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ భార్య ఊహ రీ ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఊహ కూడా ఒకప్పుటి హీరోయిన్ అనే సంగతి తెలిసిందే..! అయితే ఈ విషయం పై తాజాగా శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చాడు. సీనియర్ హీరోయిన్లందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఊహ కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా..అనే ప్రశ్నకు శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. “అంతా ఊహ ఇష్టం. తనకు ఇప్పటికే ఇలాంటి ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ ప్రస్తుతం తనకు నటనపై ఆసక్తి లేదు పెళ్ళయ్యాక సినిమాల్లోకి రాకూడదన్నది ఊహ నిర్ణయించుకుంది. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో ఇప్పుడు బాధ్యతలు పెరిగిపోయాయి. మా రెండో అబ్బాయి రోహన్ మాత్రం సినిమాల్లోకి వస్తాడు. ఇప్పటికే లాస్ ఎంజెల్స్ లో శిక్షణ తీసుకున్నాడు”… అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus