Srikanth: ఇంటర్వ్యూ : ‘కోట బొమ్మాళి పీఎస్’ ప్రమోషన్స్ లో శ్రీకాంత్ చెప్పిన ఆసక్తికర విషయాలు!
November 22, 2023 / 07:12 PM IST
|Follow Us
ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో ‘కోట బొమ్మాళి పీఎస్’ ఒకటి. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా మెయిన్ రోల్ పోషిస్తున్నారు. నవంబర్ 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీకాంత్ పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీకోసం :
ప్ర) ‘అఖండ’ మీ సెకండ్ ఇన్నింగ్స్ కి మైలేజ్ అందించిందా?
శ్రీకాంత్ : ‘అఖండ’ లో నటించడం వల్లే ఇన్ని పెద్ద సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ‘వారసుడు’ ‘స్కంద’ ‘గేమ్ ఛేంజర్’ ‘దేవర’ వంటి సినిమాల్లో ఛాన్సులు రావడానికి కారణం ‘అఖండ’ అనే చెప్పాలి.
ప్ర) ‘కోట బొమ్మాళి పీ ఎస్’ ఎలా ఉండబోతుంది?
శ్రీకాంత్ : ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా పోలీసులు క్రిమినల్స్ ని చేజ్ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీసులని పోలీసులే ఛేజ్ చేస్తూ ఉంటారు.మరోపక్క పొలిటీషియన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? . ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు వంటివి చూపించారు. చాలా వరకు ఇవి జరుగుతాయి. ఇది ఓపెన్ సీక్రెట్. సిస్టమ్ లో జరిగేది మాత్రమే చూపించారు. కానీ పొలిటికల్ గా ఎలాంటి సెటైర్ ఉండదు.
ప్ర) దర్శకుడు తేజ కూడా కేవలం రెండు సినిమాల అనుభవం కలిగిన వ్యక్తి.. ఈ సబ్జెక్టును ఎలా డీల్ చేశారు?
శ్రీకాంత్ : తను కథ చెబుతున్నప్పుడే నేను థ్రిల్ అయ్యాను. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది ఈ కథ. స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు.
ప్ర) మీ పాత్ర ఇందులో ఎలా ఉండబోతుంది?
శ్రీకాంత్ : హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో నేను కనిపిస్తాను. దీనికోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నాను. నేను రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్.. మా ముగ్గురి పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. వరలక్ష్మి శరత్ కుమార్ మా పై ఆఫీసర్ గా ఉండి.. మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వరలక్ష్మి వేసే ఎత్తులకు నేను పై ఎత్తులు వేస్తూ ఉంటాను. అది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ప్ర) మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ‘కోట బొమ్మాళి’ లో కొత్తదనం ఏముంటుంది?
శ్రీకాంత్ : గతంలో నేను చేసిన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్.. సాంగ్స్ ఫైట్స్ అన్ని ఉంటాయి. కానీ ఇందులో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా కుదిరింది. మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఉంటుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ చిత్రానికి ఇది రీమేక్. అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ ఇది.
ప్ర) ‘కోట బొమ్మాళి’ విషయంలో మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి?
శ్రీకాంత్ : పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఒరిజినల్ గా పోలీస్ ఎలా ఉంటారు.. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో.. నా పర్ఫామెన్స్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా యంగ్ బ్యాచ్. చాలా స్ట్రాంగ్ గా దీన్ని రూపొందించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ సహా అందరూ.. ప్యాషన్ తో వర్క్ చేశారు. అరకు వ్యాలీ లో ఎక్కువ భాగం షూట్ చేశాం. నైట్ టైం అడవిలో చెప్పులు లేకుండా పరిగెత్తడం, చేజింగ్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం.
ప్ర) ‘లింగిడి లింగిడి’ తర్వాత ఈ సినిమా పై బజ్ పెరిగింది .. మీకేమనిపిస్తుంది?
శ్రీకాంత్ : నిజమే. ఆ పాటకి ఆదరణ పెరగడం వల్ల.. సినిమా కూడా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ అందరిలో పెరిగింది.
ప్ర) శివాని, రాహుల్ కి మీరేమైనా సలహాలు, సూచనలు ఇచ్చారా?
శ్రీకాంత్ : ఏ ఆర్టిస్ట్ కి అయినా సిన్సియారిటీ ముఖ్యమని రాహుల్ కి, శివానికి చెప్పేవాడిని. రాహుల్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. తనను చూస్తే నా కెరీర్ స్టార్టింగ్లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. మన తెలుగు అమ్మాయి శివాని కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తుంది.
ప్ర) మిగిలిన నటీనటుల గురించి చెప్పండి?
శ్రీకాంత్: రాజకీయ నాయకుడిగా మురళీ శర్మ పోషించిన పాత్ర కీలకంగా ఉంటుంది. ఇందులో అతని పాత్రతో పాటు, డైలాగ్స్ ఎమోషన్స్ అన్నీ చాలా నాచురల్ గా ఉంటాయి. ఈ సినిమా కోసం నేను కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నా. ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, విద్య చాలా క్లారిటీగా దీన్ని రూపొందించారు అని చెప్పాలి.
ప్ర) మీ ‘ఖడ్గం’ ‘ఆపరేషన్ దుర్యోధన'(పోలీస్ రోల్) సినిమాల్లోని పాత్రలకి .. ‘కోట బొమ్మాళి’ లో మీ పాత్రలకి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా?
శ్రీకాంత్ : అస్సలు పోలిక ఉండదు.వాటితో పోలిస్తే ఇందులో.. నా పాత్ర చాలా నాచురల్ గా ఉంటుంది.
ప్ర) మీ ‘వినోదం’ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ‘పెళ్ళాం ఊరెళితే’ లో కూడా మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది.మళ్ళీ అలాంటి పాత్రలు ఏమైనా మీ నుండి ప్రేక్షకులు ఆశించవచ్చా?
శ్రీకాంత్: ఇప్పుడు కనుక నేను అలాంటి సినిమాలు చేస్తే ఓపెనింగ్స్ కూడా రావు(నవ్వుతూ).నాకు వచ్చినవి చేసుకుంటూ వెళ్లిపోవడమే.
ప్ర) ‘స్కంద’ లో ఓ హీరోయిన్ కి తల్లి పాత్ర చేశారు. హీరోలకి తండ్రి పాత్రలు చేస్తారా?
శ్రీకాంత్ : హీరోకి తండ్రి పాత్రలు చేయాలంటే.. ఇప్పటికే చాలా చేసేసేవాడిని. కానీ పాత్ర బాగుండాలి కదా. బాగుంటే చేయొచ్చు.
ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
శ్రీకాంత్ : ఇంతకు ముందు చెప్పినట్టు.. రాంచరణ్ తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్ తో ‘దేవర’ అలాగే మా అబ్బాయి రోషన్ – మోహన్ లాల్ నటిస్తున్న మూవీలో చిన్న పాత్ర (Srikanth) చేస్తున్నాను.