Srikanth Iyengar: ఏపీలోని బూమ్ బూమ్ బీర్ల పై సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సెటైర్లు!

  • September 13, 2023 / 12:31 PM IST

శ్రీకాంత్ అయ్యంగార్ అందరికీ సుపరిచితమే. ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ‘కిల్లింగ్ వీరప్పన్’ ‘ఇజం’ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. అటు తర్వాత ‘పైసా వసూల్’ ‘బ్రోచేవారెవరురా’ ‘డియర్ కామ్రేడ్’ ‘ప్రతి రోజు పండగే’ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఇతని డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా ఒదిగిపోతాడు. ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నాడు.

మరోపక్క ఇతను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన శైలిలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు శ్రీకాంత్ అయ్యంగార్. తాజాగా ఇతను పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇందులో అతను ఏపీలో బీర్లపై సెటైర్లు వేశాడు.’ఈరోజు బెజవాడలో ఉన్నాను. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. ఇది మామూలు బీరు కాదు. బూమ్ బూమ్ బీర్ అట. ఇంట్లో కూడా చెప్పలేదు.. తాగితే ఏమవుతుందో నాకు తెలీదు.

మీరు మాత్రం నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి’ అంటూ వ్యంగ్యంగా (Srikanth Iyengar) స్పందించాడు. ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. గతంలో కూడా ఏపీలో బీర్లపై రకరకాల మీమ్స్ వచ్చాయి. నోటికొచ్చిన పేర్లు పెట్టేసి బీర్లను అమ్ముతూ వస్తున్నారు. ఈ మధ్యనే ఓ సీనియర్ సెలబ్రిటీ కూడా ఏపీలో మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు అంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus