Srikanth: ‘ఖడ్గం’ మూవీలో శ్రీకాంత్ పాత్ర వెనుక అంత కథ నడిచిందా..!
August 7, 2021 / 06:55 PM IST
|Follow Us
రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఖడ్గం’ చిత్రాన్ని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకవేళ మర్చిపోదాం అనుకున్నా.. ఇండిపెండెన్స్ డేకి అలాగే రిపబ్లిక్ డే కి.. జెమినీ వారు గుర్తుచేస్తూనే ఉంటారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ఇది. ఇలాంటి సినిమాని తెరకెక్కించేందుకు అప్పట్లో ఏ దర్శకుడు కూడా సాహసం చేసే వారు కాదు. 2002 వ సంవత్సరం నవంబర్ 29న ఈ చిత్రం విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. రవితేజ అప్పటికే 3 హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉండడంతో ఈ సినిమాకి అతని క్రేజ్ మరింతగా యాడ్ అయ్యిందనే చెప్పాలి.
అందులోనూ ఈ సినిమాలో అతనికి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలు కలిగిన పాత్ర దక్కడం ఎంతో ఈజ్ తో నటించాడు. ఇక శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. అంతా బానే ఉంది కానీ ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్రకి వెంకటేష్ లేదా నాగార్జునలని తీసుకోవాలని ముందుగా నిర్మాత అనుకున్నారట. కానీ వాళ్ళు బిజీగా ఉండడంతో శ్రీకాంత్ ను ఫైనల్ చెయ్యాల్సి వచ్చింది. అయితే సెట్స్ పైకి వెళ్లే కొద్దిరోజుల ముందు కూడా నిర్మాత సుంకర మధు మురళి.. ‘శ్రీకాంత్ కు బదులు వేరే హీరోని తీసుకుందాం… అందుకు రూ.1 కోటి బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు’ అని దర్శకుడు కృష్ణవంశీతో చెప్పాడట.
అందుకు కృష్ణవంశీ.. ‘నేను శ్రీకాంత్ ను దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నాను.ఇప్పుడు అతను వద్దు అంటే కనుక నేను కూడా ఇంకో నిర్మాతని చూసుకుంటాను’ అని తేల్చి చెప్పేశాడట. అలా అది శ్రీకాంత్ చేయడం ‘ఖడ్గం’ సూపర్ హిట్ అవ్వడం… అటు తర్వాత శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళాం ఊరెళితే’ ‘ఒట్టేసి చెబుతున్నా’ వంటి సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడం జరిగింది.