టాలీవుడ్ నటుడి నిజస్వరూపం బయటపెట్టిన కో డైరెక్టర్!

  • March 24, 2021 / 12:54 PM IST

‘అష్టా చమ్మా’ సినిమాతో నటుడిగా టాలీవుడ్ కి పరిచయమైన అవసరాల శ్రీనివాస్ ఆ తరువాత.. ‘పిల్ల జమీందార్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘అ ఆ’ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. దాదాపుగా పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటోన్న ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. అయితే తాజాగా.. అవసరాల శ్రీనివాస్ దగ్గర పని చేసే కో డైరెక్టర్ అతడిపై కామెంట్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మూడేళ్లుగా అవసరాల శ్రీనివాస్ వద్ద కో డైరెక్టర్ గా పని చేస్తున్నానని.. అలాంటిది తనను ఆఫీస్ లో అందరి ముందు తిట్టేసి బయటకి పంపించేశాడని ఎమోషనల్ గా వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన నిజస్వరూపాన్ని మీకు చూపిస్తా అంటూ ఫోటోషూట్ లో పాల్గొంటున్న అవసరాల దగ్గరకి వెళ్లి గొడవ పడుతూ.. అతడు పెట్టుకున్న టోపీ తీసేయగా.. అవసరాల బట్టతలతో కనిపించారు. ”ఈ వీడియో బయటకి వెళ్తే నువ్ ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ” అవసరాల..

కో డైరెక్టర్ కి వార్నింగ్ ఇవ్వడం.. దానికి ఆయన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో పెట్టి వైరల్ చేస్తానని చెప్పడం కనిపించింది. అయితే ఇదంతా స్క్రిప్టెడ్ అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఏ సినిమా కోసం ఇలా వింత ప్రమోషన్స్ చేస్తున్నారో.. ఇంకా తెలియలేదు. మరి దీనిపై అవసరాల శ్రీనివాస్ స్పందిస్తాడేమో చూడాలి!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus