డైరెక్టర్ గా మారి చాలా పెద్ద తప్పు చేసాను : శ్రీనివాస్ రెడ్డి
April 21, 2020 / 04:00 PM IST
|Follow Us
కమెడియన్ లు హీరోలుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అలా హీరోగా చేసి కొన్ని హిట్లు అందుకున్న వారిని కూడా మనం చూస్తూనే వచ్చాము. అయితే కమెడియన్ లు డైరెక్టర్ లు గా మారి సినిమాలు చేసిన వాళ్ళంతా ప్లాప్ లే మూట కట్టుకున్నారు. ‘ఓరి నీ ప్రేమ బంగారం కాను’ ‘రూమ్ మేట్స్’ ‘అంకుల్’ వంటి చిత్రాలతో ప్లాప్ లు మూటకట్టుకున్నాడు. ఇక ‘కొడుకు’ చిత్రంతో ఎం.ఎస్.నారాయణ పెద్ద ప్లాప్ మూటకట్టుకున్నాడు. ఇక వెన్నెల కిశోర్ కూడా ‘వెన్నెల 1 1/2’ చిత్రం డైరెక్ట్ చేసి ప్లాప్ మూటకట్టున్నాడు.
ఇంతమంది కమెడియన్ లు డైరెక్టర్లు గా ఫెయిల్ అయినప్పటికీ అవసరాల శ్రీనివాస్ మాత్రం సక్సెస్ అయ్యాడు. బహుసా అందుకేనేమో శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ గా మారి ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయడమే కాదు… అతనే నిర్మించాడు కూడా. ఆ చిత్రాన్ని చేసినందుకు ఇప్పుడు చాలా బాద పడుతున్నాడు.” ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ అనే చిత్రం కథని నేను ఎంతో ఇష్టపడి తీసాను. నిర్మాతగా, డైరెక్టర్ గా కూడా మారి మరీ చేశాను. కానీ ఆ చిత్రం ఫలితం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.
చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. డైరెక్టర్ గా మారి తప్పు చేశానేమో అనిపించింది.ఇండస్ట్రీ నుండీ కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే అనుభవం వున్న దర్శకుడిలా తీశావు అని కొంతమంది ఎంకరేజ్ చేసారు.అందుకు మాత్రం నాకు ఆనందం కలిగింది. ఇక హీరో అయిన తరువాత కమెడియన్ గా నాకు అవకాశాలు తగ్గాయి. కమెడియన్ గా చేస్తానో లేదోనని చాలా మంది అనుకుంటున్నారు.కానీ కమెడియన్ గా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే” అంటూ చెప్పుకొచ్చాడు శ్రీనివాస్ రెడ్డి.