టాలీవుడ్లో మరో విషాదం…చిన్న వయసులోనే నటి కన్నుమూత..!

  • December 7, 2021 / 07:38 PM IST

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దీలిప్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, శివశంకర్ మాస్టర్ , బీఏ రాజు వంటి దిగ్గజాలతో పాటు టి.ఎన్నార్, కత్తి మహేష్.. వంటి ప్రముఖులు కూడా మరణించారు.చిన్నా చితకా ఆర్టిస్ట్ లు కూడా కొంతమంది మరణించారు. తాజాగా ఈ లిస్ట్ లో బుల్లితెర నటి శ్రియా మురళీధర్ కూడా చేరింది. సోమవారం రాత్రి గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచింది.

ఈమె వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. హైదరాబాద్‌… ల‌క్డిక‌పూల్‌‌ ఏరియాకి చెందిన శ్రియా మురళీధర్…బుల్లితెర పై యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అటు తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించి యూత్ కు దగ్గరయ్యింది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో కూడా ఓ పాత్ర పోషించింది.అలాగే ‘వాట్ ద ఫన్’ యూట్యూబ్ ఛాన‌ల్‌లో కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది శ్రీయ.

ఈ మధ్యనే ఈమెకు సినిమా అవకాశాలు కూడా వరించాయట.కానీ వాటిని పూర్తిగా సద్వినియోగపరుచుకోకుండానే ఈమె మరణించింది.బిగ్ స్క్రీన్ పై కూడా రాణించాలని ఈమె కలలు కనేదట. అది నెరవేరకుండానే ఈమె తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయినట్టు స్పష్టమవుతుంది. ఇక శ్రీయా మృతి పట్ల దీప్తీ సునయన, సినీ నటి సురేఖ కుమార్తె సుప్రియ, వంటి వారు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus