Adipurush Teaser: పౌరాణిక చిత్రాలు తెలుగోడు తీస్తేనే బాగుంటుంది: ఎస్.ఎస్. కాంచి
October 3, 2022 / 11:00 AM IST
|Follow Us
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ టీజర్ నిన్న అంటే అక్టోబర్ 2న రిలీజ్ అయ్యింది. శ్రీరాముడు నడిచిన నేలగా ప్రసిద్ది చెందిన అయోధ్యలో సరయు నది తీరాన ఈ చిత్రం టీజర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఆదిపురుష్ టీజర్ చూసిన ప్రేక్షకులు మిక్స్డ్ రెస్పాన్స్ చెబుతున్నారు. ఇదొక బొమ్మల సినిమా అనుకుంట, గ్రాఫిక్స్ వరస్ట్ గా ఉన్నాయి, రజినీకాంత్ కొచ్చాడియాన్ గుర్తుకొచ్చింది అంటూ ఆదిపురుష్ టీజర్ ను విమర్శిస్తున్నారు.వి.ఎఫ్.ఎక్స్ అనేవి నాసిరకంగా ఉన్నాయి అనే మాట అయితే వాస్తవమే.
ప్రభాస్ వంటి హీరోని పెట్టుకుని ఇలాంటి మోషన్ క్యాప్చూర్ సినిమా తీయడం అనేది అంత ఈజీగా డైజెస్ట్ అయ్యే విషయం కాదు. దీనికి రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టారు అనే వార్త కూడా డైజెస్ట్ చేసుకునేది కాదు. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ టీజర్ పై రాజమౌళి సోదరుడు ఎస్.ఎస్.కాంచి పరోక్షంగా సెటైర్లు వేశాడు. పౌరాణిక చిత్రం తీస్తే తెలుగోడు మాత్రమే తీయాలి అన్నట్టు తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు కాంచి.
ఈయన కామెంట్ కు కొంతమంది ఏకీభవించినా మరికొంత మంది మండిపడుతున్నారు. తెలుగులో పౌరాణిక చిత్రాలు అనేవి హీరో ఇమేజ్ కు తగ్గట్టు మార్చి తీసి చెడగొట్టిన సందర్భాలు ఉన్నాయి అని, హిందీ వాళ్ళు తీసిన మహాభారతం, రామాయణం వంటి వాటిని ఇప్పటికీ డబ్బింగ్ చేసి తెలుగు ఛానల్స్ లో టెలికాస్ట్ చేసినా జనాలు చూస్తున్నారు అని గుర్తుచేస్తున్నారు.
మరికొంత మంది అయితే ఆది పురుష్ వంటి చిత్రాన్ని రాజమౌళి మాత్రమే తీయాలి అని పరోక్షంగా కాంచి చెబుతున్నట్టు భావిస్తున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక కాంచి అమృతం సీరియల్ లో నటించి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే సై,మర్యాద రామన్న, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న చిత్రానికి కథ అందించింది కూడా ఈయనే..!