Mahesh Babu: ఎక్కడ చూసినా ఇదే టాక్‌… నమ్మేయాలనంతగా

  • May 4, 2021 / 12:58 PM IST

11 ఏళ్ల తర్వాత ఓ హీరో, దర్శకుడు కలసి పని చేస్తున్నారు అంటే ఆ సినిమా ఎంత అంచనాలు ఉంటాయి. అందులోనూ గతంలో చేసిన సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రంగా నిలిచింది అయితే ఆ అంచనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ హీరో, దర్శకుడు ఎవరో అనేది. వాళ్లే మహేష్‌బాబు, త్రివిక్రమ్. ఇంకా ఇప్పుడు చెబుతున్నది #SSMB28 గురించి. ఇప్పుడు ఇండస్ట్రీలోని పుకార్లలో ఎక్కువ శాతం ఈ సినిమా మీదే ఉన్నాయి. తాజాగా రెండు కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. మహేష్‌ – త్రివిక్రమ్ సినిమాను ఇటీవల ప్రకటించారు. ఇంకా ముహూర్తం కూడా జరగలేదు.

త్వరలో ఈ కార్యక్రమం ఉంటుందని టాక్‌. ఈలోగా సినిమా టైటిల్‌ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆ పేరు చూస్తుంటే ఈ సినిమా కథ, నేపథ్యం కూడా తెలిసిపోయేలా ఉన్నాయి. ‘అతడు’ సినిమాలో హీరో పేరు కాకపోయినా, కీలకంగా మారిన పేరు ‘పార్థు’. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో రానున్న సినిమాకు ఆ పేరు పెడుతున్నారట. అయితే ఆ పేరు పెట్టడం వెనుక కారణం.. కొత్త సినిమా ‘అతడు’కి సీక్వెల్‌ అని తెలుస్తోంది. టాలీవుడ్‌లో సీక్వెల్స్‌కు పెద్దగా ఆదరణ ఉండదనే విషయం తెలిసిందే. అందుకే ఆ విషయం ప్రస్తావించకుండా ‘పార్థు’ అనే పేరును వాడుకుంటూ సినిమా తీస్తున్నారట.

ఇందులో మహేష్‌ డాన్‌గా కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. అంటే ‘అతడు’కి ఈ సినిమా ప్రీక్వెల్‌ అవ్వొచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. ‘అతడు’లో చిన్నప్పటి మహేష్‌ పాత్ర, పెద్దయ్యాక మహేష్‌ పాత్ర చూపిస్తారు. మరి మధ్యలో ఏమైందో చెప్పరు. ఆ విషయం ఇప్పుడు చూపిస్తారా అనేది తెలియడం లేదు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన టీజర్‌ వీడియోగా ‘అతడు’ క్లైమాక్స్‌ సీన్‌ను హారిక హాసిని చినబాబు తనయుడు సూర్యదేవర నాగవంశీ ట్వీట్‌ చేశారు. అంటే స‘అతడు’ క్లైమాక్స్‌ తర్వాత పార్థు ఏం చేశాడనేది ఇప్పుడు చూపిస్తారనే వాదనలూ వినిపిస్తున్నాయి. వీటిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఏదేమైనా ‘ఖలేజా’కి సీక్వెల్‌ కాకుండా ఉంటే చాలు. ఏమంటారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus