Mahesh Babu, Trivikram: పెద్ద హీరోల సినిమాలన్నారు.. ఏవీ లేనట్లున్నాయిగా!
June 23, 2022 / 01:47 PM IST
|Follow Us
స్టార్ హీరో సినిమా షూటింగ్ మొదలవుతుండటం, ఆరేడు నెలలలో ఓ పండగ ఉంటే.. దానికే విడుదల అని అందాజ్‌గా చెప్పేయొచ్చు. అలా మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమాను కూడా సంక్రాంతికే తీసుకొస్తారు అని అనుకున్నారంతా. మొన్నామధ్య సినిమా ముహూర్తపు షాట్ కూడా అయిపోయింది. మేలోనో, జూన్‌లో సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అన్నారు కానీ.. ఇంతవరకు ఆ దాఖలాలు లేవు. సినిమా స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదని, అందుకే ఆలస్యమని టాక్ వస్తోంది. అయితే ఇప్పుడు వేరే సినిమా అనౌన్స్మెంట్ చూస్తుంటే సినిమా సంక్రాంతికి వచ్చేలా లేదు అనిపిస్తోంది.
వైష్ణవ్ తేజ్ – శ్రీలీల సినిమా ఇటీవల ముహూర్తం జరుపుకుంది. ఎన్. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్లో భాగంగా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తాం అని కూడా చెప్పేశారు. అంటే 2023 పొంగల్‌కి పెద్ద సినిమాలేవీ లేవు అనే మాట చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలో వారికే చెందిన హారిక హాసిని పతాకంపై రూపొందనున్న మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా కూడా లేనట్లే అనేగా.
వైష్ణవ్‌తేజ్ సినిమా అనౌన్స్‌మెంట్‌తో వచ్చే సంక్రాంతి మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది అని చెప్పొచ్చు. తొలుత సంక్రాంతికి రామ్‌చరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, పవన్ కల్యాణ్ వస్తారు అని అనుకున్నారు. అయితే ఆఖరకు వచ్చినప్పుడు రెండు సినిమాలే మిగులుతాయి అని కూడా అనుకున్నారు. శంకర్ – చరణ్ సినిమా ఇంకా ఆలస్యమవుతుందని టాక్. అందుకే విజయ్ ‘వారసుడు’ వచ్చేశాడు ఆ తేదీకి. ఇక ఎన్టీఆర్, మహేహేష్ సినిమాలు మొదలవ్వలేదు. పవన్ ‘హరి హర వీరమల్లు’ సంగతి చెప్పక్కర్లేదు.
దీంతో 2023 సంక్రాంతి చాలా చప్పగా ఉంటుందని అని చెప్పొచ్చు. పెద్ద హీరోల సినిమాలు ఉండి, అవి హిట్ అయితేనే సంక్రాంతి సీజన్ సూపర్ అనలేకపోతున్నాం. అలాంటి ఓ తమిళ డబ్బింగ్ సినిమా, కుర్ర హీరోల సినిమాలు వస్తే ఉపయోగం ఏముంటుంది అనేదే ప్రశ్న. చూద్దాం ఇంకెవరైనా స్టార్ సంక్రాంతికి వైల్డ్ కార్డు ద్వారా వస్తారేమో.