Alia Bhatt: అలియాభట్ సినిమా కోసం పాకిస్థాన్ నటుడు ఏం చేశాడో తెలుసా?

  • March 24, 2022 / 06:42 PM IST

బాలీవుడ్ నటి అలియాభట్ నటించిన ‘గంగూబాయి కతియవాడి’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా 25న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మాఫియా క్వీన్, వేశ్య పాత్రలో అలియా అద్భుతంగా నటించింది. తన అందం, డైలాగ్స్ తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన అలియా.. ఈ సినిమాలో తన వైవిధ్యమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Click Here To Watch NOW

దీంతో అలియా ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అలియా నటించిన ‘గంగూబాయి కతియవాడి’ సినిమా చూడడానికి ఓ అభిమాని ఏకంగా థియేటర్ ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన మోడల్‌, యాక్టర్‌ మునీబ్ బట్‌ అలియా భట్‌కు వీరాభిమాని. ఈ అభిమానంతోనే ‘గంగూబాయి కతియవాడి’ సినిమాని తన భార్యతో కలిసి చూడడానికి మొత్తం థియేటర్ నే బుక్ చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు.

దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలియాభట్ ఫ్యాన్ పేజీల్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కామాఠిపురలోని రెడ్‌లైట్‌ ఏరియాలో గంగూబాయి అనే యువతి మాఫీయా క్వీన్‌గా ఎలా మారిందనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో సినిమాతో అలియా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది.

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియా హీరోయిన్‌గా నటించింది. సీత పాత్రలో ఆమె నటన మెస్మరైజ్ చేయనుందని అంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆలియా రోల్ మరింత ఆసక్తికరంగా మార్చారట జక్కన్న. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus