Naga Chaitanya, Samantha: నాగ్ అడిగారని కాదనలేకపోయా.. చైతు-సామ్ ఇంటి స్టోరీ!
July 22, 2022 / 11:16 AM IST
|Follow Us
టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఫేమ్ తెచ్చుకున్న సమంత, నాగచైతన్య గతేడాది విడాకులు తీసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికీ అభిమానులు వీరి విడాకుల సంగతిని జీర్ణించుకోలేకపోతున్నారు. చైతు, సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లో మళ్లీ కలవండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు అభిమానులు. కానీ వారికి అలాంటి ఆలోచన లేనట్లు ఉంది. ఇద్దరూ తమ కెరీర్స్ లో చాలా బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం చైతు నటించిన ‘థాంక్యూ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు సైన్ చేస్తోంది. ఇలాంటి సమయంలో చై-సామ్ విడాకుల విషయంపై సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించారు. వారిద్దరి విడాకుల గురించి తెలిస్తే ఇద్దరితో మాట్లాడేవాడినని అన్నారు. చైతు-సమంత తన ఇంట్లోనే ఉండేవారని వెల్లడిస్తూ.. ఆ ఇంటి సంగతులను వెల్లడించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో తనకు కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయని..
వాటిలో మూడు ఇళ్లను తన ఫ్యామిలీ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నానని చెప్పారు మురళీ మోహన్. ఒకసారి చైతు,సమంత తమ అపార్ట్మెంట్స్ చూడడానికి వచ్చారని.. స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న అపార్ట్మెంట్ వారికి నచ్చడంతో.. అది కావాలని అడిగారని గుర్తుచేసుకున్నారు మురళీ మోహన్. కానీ దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో.. వారు అప్సెట్ అయ్యారని అన్నారు.
కొన్ని రోజుల తరువాత నాగార్జున ఆడడంతో కాదనలేక వారికి ఇల్లు ఇచ్చానని.. పెళ్లయ్యాక చైతు-సమంత అక్కడే ఉన్నారని తెలిపారు. వారెప్పుడు గొడవ పడడం చూడడలేదని.. ఆ ఇంట్లో పార్టీలు కూడా జరిగేవి కాదని.. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేదని అన్నారు. వారిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని.. లేదంటే కచ్చితంగా వారితో మాట్లాడేవాడినని అన్నారు.