ప్రముఖ నిర్మాత రేప్ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కన్నడ నటుడు, నిర్మాత అయిన వీరేంద్రబాబును బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఓ మహిళ ఇతనిపై కేసు పెట్టినట్లు తెలుస్తుంది. ‘2021 లో ఒక రోజు అపస్మారక స్థితిలో ఉన్న నా పై వీరేంద్రబాబు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా రికార్డు చేసిన వీడియో చూపిస్తూ నన్ను రూ.15 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
అంటూ ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నట్టు సమాచారం. అత్యాచార కేసు ఆరోపణలతో కన్నడ నటుడు అరెస్ట్ అవ్వడం కన్నడ సినీ పరిశ్రమను షాక్ లోకి నెట్టేసినట్లు అయ్యింది. స్వయం కృషి అనే సినిమాతో నటుడు, నిర్మాతగా మారాడు వీరేంద్రబాబు. అలాగే నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడమేంటి అంటూ కన్నడ మీడియా అతన్ని ఏకిపారేస్తోంది.
ఇక ఇతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు గత నెల అంటే జూలై 30 న వీరేంద్ర ఆ మహిళకి మళ్లీ ఫోన్ చేసి బెదిరించాడట. ఆమె బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు బెదిరించడమే కాకుండా గన్‌తో చంపేస్తానంటూ ఆమెను బెదిరించడం కూడా జరిగిందట. పోలీసులు ఇంకా అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు కొన్ని నెలల క్రితమే (Actor) వీరేంద్రబాబు రూ.1.8 కోట్లు మోసం చేసిన కేసు కూడా బయటపడినట్లు తెలుస్తోంది.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!