3 పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడంతో సహజీవనం బెటర్ అని ఆ సీనియర్ నటితో ఫిక్స్ అయ్యాడట..!
March 2, 2022 / 09:39 PM IST
|Follow Us
పెళ్ళిళ్ళు- విడాకులు- సహజీవనాలు- బ్రేకప్ లు.. సినిమా జనాలకి సర్వసాధారణమైన విషయాలు. వాళ్లకి మాత్రమే కాదు టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈ కాలంలో చాలా మందికి ఇది ఆఫ్ట్రాల్ మేటర్ అయిపోయింది. అయినా సినిమా వాళ్ళు మనకి బాగా స్పెషల్ కాబట్టి.. చాలా మందికి వాళ్ళు టైం పాస్ టాపిక్ కాబట్టి.. ఇంకోసారి వాళ్ళ పర్సనల్ వ్యవహారం గురించి మాట్లాడుకుందాం. ఓ సీనియర్ నటుడు.. ఒకప్పుడు ఈయన హీరోగా కూడా చేసి ఎన్నో హిట్లు అందుకున్నాడు.
అయితే కామెడీ హీరోగా లెండి. ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. చాలా ట్యాలెంటెడ్ కూడా..! మొత్తంగా ఈయన 3 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడు. అయితే 3 పెళ్ళిళ్ళు ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం ఇతని స్టేటస్ సింగిల్. స్టేటస్ మాత్రమే సింగిల్. కానీ కొంతకాలంగా ఇతను మరో సీనియర్ నటితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈమె ఓ కన్నడ నటి. కానీ ఇప్పుడు తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా చేస్తుంది. తల్లి, అత్త పాత్రలతో యమ బిజీగా గడుపుతుంది.
తెలుగులో 50కి పైగా సినిమాల్లో నటించింది. ఈమె కూడా విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో తెలుగులో సెటిల్ అయ్యిందట. 2018 లో వచ్చిన ఓ సూపర్ హిట్ హిట్ మూవీలో ఈమె హీరో తల్లి పాత్ర పోషించింది. అదే సినిమాలో హీరో తండ్రిగా చేసిన వ్యక్తే మన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న సీనియర్ హీరో. ఆ టైములో వీరిద్దరూ కనెక్ట్ అవ్వడం, అప్పటి నుండీ సహజీవనం కొనసాగుతున్నట్టు సమాచారం.