సినీ తారల.. విడాకుల విశేషాలు

  • December 15, 2016 / 02:04 PM IST

టాలీవుడ్ కు విడాకులు పెద్ద కొత్తేమీ కాదు…విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అన్నగారి నుంచి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకూ…రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న మగమహారాజులే. అయితే మన సినిమా వల్ల ప్రేక కధలు కొన్ని సుఖాంతం అయితే, మరికొన్ని విడాకులకు దారి తీసాయి…మరి అలా విడాకుల బారిన పడిన మన తారలను ఒక లుక్ వెయ్యండి..

అక్కినేని నాగార్జునటాలీవుడ్ మన్మధుడు నాగ్ ముందు 1984లో రామానాయుడుగారి కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైతన్య పుట్టిన తరువాత లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నాడు నాగ్. అయితే వీరికి పుట్టిన వాడే అఖిల్..ప్రస్తుతం అఖిల్, చైతు ఇద్దరూ టాలీవుడ్ హీరోలుగా ఉన్నారు.

పవన్ కల్యాణ్మెగా బ్రదర్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్, ముందు నందినిను పెళ్లి చేసుకున్నాడు…నందినికి విడాకులు ఇచ్చిన తరువాత బద్రి సినిమాలో తనతో పాటు నటించిన రేణూ దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక రేణూ దేశాయ్ కు విడాకులు ఇచ్చి తీన్మార్ లో కనిపించిన అన్నా లెస్నవా ను పెళ్లి చేసుకున్నాడు.

కమల్ హసన్లెజెండరీ యాక్టర్ కమల్ తొలుత డ్యాన్సర్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు…10ఏళ్ల కాపురం తరువాత విడాకులు ఇచ్చి…ఆ తరువాత సారిక అనే తారతో సహజీవనం చేశాడు..వారికి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత 2004లో విడాకులు తీసుకుని, ఇప్పుడు హీరోయిన్ గౌతమితో సహజీవనం చేస్తున్నాడు.

సుమంత్ – కీర్తి రెడ్డిఅక్కినేని నాగేశ్వర్ రావ్ మనుమడు సుమంత్, తొలిప్రేమ, అర్జున్ సినిమాలో మెరిసిన కీర్తి రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు…2004లో వివాహం చేసుకున్న వీళ్ళు 2006లో విడాకులు తీసుకున్నారు.

ప్రభుదేవాప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ, రామ్ లత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే ఆ తరువాత 2011లో ఆమెకు విడాకులు ఇచ్చి సెక్సీ బ్యూటీ నయనతారతో సహజీవనం చేశాడు. కానీ అనుకోకుండా నయనతార ప్రభూకి హాండ్ ఇచ్చి పెళ్ళికి ఒప్పుకోలేదు.

ప్రకాష్ రాజ్విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముందు లలిత కుమారి అనే సినిమా తారను 1994లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. అయితే 2009లో ఆమెకు విడాకులు ఇచ్చి 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీవర్మను పెళ్లి చేసుకున్నాడు.

శరత్ బాబుప్రముఖ నటుడు శరత్ బాబు 1981లో ముందు రమప్రభను పెళ్లిచేసుకున్నాడు. అయితే ఆ తరువాత 1998లో ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహలత దీక్షిత్ ను పెళ్లి చేసుకున్నాడు…కానీ ఈ పెళ్లి కూడా విడాకుల సాక్షిగా వీగిపోయింది.

రామచలంప్రముఖ నటుడు రామచలం తొలుత రమణకుమారి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే 1964లో అగ్ని ప్రమాధంలో ఆమె మరణించడంతో ఊర్వశీ శారదను పెళ్లి చేసుకున్నారు..కానీ చివరకు విడాకులు తీసుకుని విడిపోయారు.

రాధికఅందాల తార రాధిక దాదాపుగా 3సార్లు పెళ్ళిచేసుకున్నారు. తొలుత 1985లో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పాతన్ ను పెళ్లి చేసుకుని వెంటనే ఒక ఏడాదిలోనే విడాకులు ఇచ్చి ఆ తరువాత 1990లో రిచర్డ్ హార్డీను పెళ్లి చేసుకుని రెండు ఏళ్లకు విడాకులు ఇచ్చి 2001లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారు.

ఊర్వశీప్రముఖ తమిళ తార, దాదాపుగా 400సినిమాలకు పైన నటించిన ఊర్వశీ మనోజ్ కే. జయన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే 2008లో విడాకులు తీసుకుని 2013లో చెన్నై బిల్డర్ శివప్రసాద్ ను పెళ్లి చేసుకుని, మగ బిడ్డకు జన్మను ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus