తప్పైపోయిందంటూ సారీ చెప్పిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
November 25, 2022 / 05:37 PM IST
|Follow Us
సామాన్య జనాలైతే పెద్దగా పట్టించుకోరు కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు మైక్ పట్టుకుని మాట్లాడేటప్పుడు కానీ.. ఏదైనా ఒక విషయం గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేస్తారు నెటిజన్లు.. ఇక ఆ ట్రోలింగ్ తట్టుకోవడం కష్టం. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. రీసెంట్గా ఓ నటి అలాంటి వివాదంలో చిక్కుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ యాక్ట్రెస్ రిచా చద్దా..
హిందీ మూవీస్, వెబ్ సిరీస్ చూసేవాళ్లకు తను పరిచయమే. బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రిచా.. ‘ఇన్ సైడ్ ఎడ్జ్’ వెబ్ సిరీస్, ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’, ‘ఫక్రే’, ‘షకీలా’ లాంటి సినిమాల్లో నటించింది. ఈమె హీరోయిన్గా చేసిన ‘ఫక్రీ 3’ రిలీజ్‌కి రెడీగా ఉంది.. ఇప్పుడు ఆమె ఇండియన్ ఆర్మీ గురించి చేసిన ఓ పోస్ట్ విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేస్తూ.. వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణ చెప్పింది..
నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి, వారిని వెనక్కి పంపడానికి సిద్ధంగా ఉన్నామని.. కేంద్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని.. ఆర్డర్ పాస్ చేస్తే.. ఆపరేషన్ త్వరగా ముగిస్తామని ట్వీట్ చేశారు. దీనిపై రిచా రియాక్ట్ అయింది.. ‘‘గల్వాన్ సేస్ హాయ్’’ అని ట్వీట్ చేసింది. అంతే.. గల్వాన్ ప్రస్తావన తీసుకు రావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్ పెట్టావంటూ విరుచుకుపడ్డారు.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టాలీవుడ్ స్టార్స్ నిఖిల్, మంచు విష్ణు తదితరులు కూడా ఆమె ట్వీట్‌ని తప్పుపట్టారు. దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేస్తూ.. ట్విట్టర్ ద్వారా బహిరంగ క్షమాపణ కోరుతున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘నేను చేసి ట్వీట్ వివాదానికి కారణమైంది. నా ఉద్దేశం ఎవరినీ బాధపెట్టాలని కాదు. భారత సైన్యంలో పనిచేసే నా సోదరులకు అది బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నాను.
మా తాతయ్య కూడా భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు. 1960 ఇండో – చైనా యుద్ధంలో ఆయన కాలికి గాయమైంది కూడా. మా మామయ్య కూడా పారామిలిటరీలో పనిచేశారు. దేశభక్తి అనేది నా రక్తంలోనే ఉంది. దేశం కోసం సైనికుడు గాయపడినా, చనిపోయినా అతడి కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు’’ ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ ట్వీట్ చేయలేదు.. క్షమించండి’’ అంటూ రిచా తన పోస్టులో వివరించింది.