గాయాలతోనూ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆ హీరోయిన్ ఎవరంటే..?

  • March 15, 2023 / 07:49 PM IST

ఇటీవల కాలంలో చిత్రీకరణ సమయంలో నటీనటుల ప్రమాద వశాత్తు గాయాల పాలవుతున్నారు.. తాజాగా మరో నటి షూటింగులో తీవ్ర గాయాలు అయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆమె స్టార్ హీరోయిన్‌గానే కాకుండా, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భార్యగానూ చాలామందికి పరిచయమే. యాక్టింగ్ మాత్రమే కాదు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన ఆమెని చూస్తే.. ఇప్పటి హీరోయిన్లు చాలామంది కుళ్లుకుంటారు.

అంతలా ఫిజిక్ మెయింటెన్ చేస్తూ ఉంటుందామె. ఎప్పుడూ షూటింగ్స్, డైరెక్షన్ అంటూ బిజీబిజీగా ఉండే ఆ నటి ముఖం బాగా ఎర్రగా కందిపోయింది.. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. హిందీ మూవీస్ చూసే వాళ్లకు దివ్యా ఖోస్లా కుమార్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. ఈమె టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య.. 2004లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత భూషణ్ కుమార్‌ని పెళ్లి చేసుకుని.. 10 సంవత్సరాల పాటు ప్రొఫెషన్‌ను పక్కన పెట్టేసిది..

2014లో ‘యారియన్’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగానూ 8 సినిమాలు తీసింది.. ఆ తర్వాత ‘సనమ్ రే’, ‘బుల్ బుల్’, ‘సత్యమేవ జయతే 2’ వంటి మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం ‘యారియన్ 2’లో నటిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ప్రస్తుతం యూకేలో షూటింగ్ జరుగుతోంది.. అందులో భాగంగా ఓ యాక్షన్ సీన్ తీశారు. అనుకోకుండా దివ్య ప్రమాదానికి గురైంది.. ముఖానికి బాగా దెబ్బలు తగిలాయి.

గాయాల పాలైనా షూటింగ్ ఆపలేదని.. తాను కోలుకోవడం కోసం ప్రార్థించాలని నెటిజన్లను రిక్వెస్ట్ చేసింది.. దీంతో దివ్యా ఖోస్లా కుమార్ త్వరగా కోలుకోవాలంటూ మూవీ టీమ్, బాలీవుడ్ వారు, ఫ్యాన్స్ ఇంకా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మీజాన్ జాఫ్రీ, వరీనా హుస్సేన్ తదితరులు నటిస్తున్న ‘యారియాన్ 2’ ఈ ఏడాది అక్టోబర్ 20కి రిలీజ్ షెడ్యూల్ చేసుకుంది..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus