Star Actress: నేను కూడా బాధితురాలినే.. అంటున్న స్టార్ హీరోయిన్!

  • August 28, 2023 / 10:48 PM IST

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కొత్త టాపిక్ కాదు. ఇక్కడ పనిచేసి ఎదగాలి అనుకునే అమ్మాయిలకి ఇదొక శాపంలా మారింది అంటూ చాలామంది కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది నటీమణులు మీడియా. సోషల్ మీడియా వేదికగా దీని గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫేడౌట్ అయిపోయిన లేక ఫేడౌట్ దశకు దగ్గరగా ఉన్న హీరోయిన్లు లేదా నటీమణులు మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడుతుకున్నారు.

కానీ చాలా మంది (Actress) హీరోయిన్లు.. బిజీగా ఉన్నన్ని రోజులు దీని గురించి మాట్లాడటం లేదు. అయితే తాజాగా ఓ హీరోయిన్ మళ్ళీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మరెవరో కాదు అను ఇమ్మాన్యుయేల్. ‘ఇండస్ట్రీలో నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యని ఎదుర్కొన్నాను. ఆ టైమ్ లో నాకు నా ఫ్యామిలీనే అండగా నిలబడింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎలాంటి సమస్యలనైనా జయించొచ్చు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె కార్తీ సరసన ‘జపాన్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే ఆమె ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత గోపీచంద్ తో ‘ఆక్సిజన్ ‘ పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ , అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus