ఆ నటిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపేశారట..!

  • December 28, 2022 / 10:35 PM IST

సినీ పరిశ్రమలో ఈ ఏడాది చాలా మంది కన్నుమూశారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది దారుణమైన సంఘటన గురించి. ఇది పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ నటి ఇషా ఆలియాను ఓ దొంగల ముఠా దారుణంగా కాల్చి చంపేసింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా వద్ద నేషనల్ హై వే 16పై బుధవారం నాడు తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తూ ఉండగా స్నాచర్లు కాల్చి ఇషా అలియాను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపేశారు. కారులో ఇషాతో పాటు ఆమె భర్త ప్రకాష్ కుమార్ మరియు మూడేళ్ల కుమార్తె‌ ఉన్నారు. ఇషా కుటుంబం రాంచీ నుండి కోల్ కతా బయలుదేరుతుండగా ఈ ముగ్గురు స్నాచర్లు ఈ ఘోరమైన సంఘటనకు పూనుకున్నట్లు స్పష్టమవుతుంది.

అయితే ఇషాను హాస్పిటల్ కి తీసుకెళ్లినా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారట. ఇషా జార్ఖండ్‌లో నివసించే ఓ నటి. ఆమె అసలు పేరు రియా కుమారి. ‘ముగ్గురు వ్యక్తులు తమపై దాడి చేశారని, అన్యాయంగా తన భార్యను చంపేశారు’ అంటూ ఆమె భర్త కుమార్ పోలీసులకు తెలిపాడు. “నా భార్య నా కూతురుతో కలిసి కారులో కూర్చుంది.

దుండగులు నా పర్సు లాక్కోవడానికి ప్రయత్నించగా, నా భార్య దిగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో వారు ఆమెను కాల్చి చంపేశారు” అంటూ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది. పోలీసులు ఆ దొంగల గురించి గాలిస్తున్నారు. వారికి కఠినమైన శిక్ష పడాలని.. అంతా కోరుకుంటున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus