తన బాయ్ ఫ్రెండ్ కు అందరూ చూస్తుండగా లిప్ లాక్ పెట్టేసింది..!
April 27, 2019 / 03:04 PM IST
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ‘మణికర్ణిక’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అంకిత లోఖండే. ఈ చిత్రంలో ‘జుల్కరి బాయ్’ పాత్ర మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.హిందీ టీవీ రంగంలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ కొన్ని కారణాల వల్ల సుశాంత్ తో విడిపోయింది. తరువాత ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్కీ జైన్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు కూడా టాక్ నడిచింది.
అయితే ఈ విషయం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది ఈ భామ. అంకిత మాట్లాడుతూ.. “విక్కీ జైన్.. నేను గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నాను. అతడు చాలా మంచి వ్యక్తి.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఒకవేళ పెళ్ళి చేసుకుంటే అందరినీ పిలిచే చేసుకుంటాను.. కానీ ఇంకా దాని గురించి ఏమీ ప్లాన్ చేసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ జంట.. తమ స్నేహితుల ఇంట పెళ్ళి వేడుకకు వెళ్ళారు. ఈ వేడుకలో భాగంగా ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు కూడా. ఇక ఇదే సందర్భంలో అంకిత తన ప్రియుడు విక్కీని దగ్గరకు తీసుకొని అందరూ చూస్తుండగానే లిప్ లాక్ పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతుంది.