ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు.. నటి ఎమోషనల్ కామెంట్స్..!
April 30, 2021 / 05:58 PM IST
|Follow Us
సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు అనే టాపిక్ కొత్తదేమీ కాదు. క్యాస్టింగ్ కౌచ్, మీటూ వంటి పేర్లతో ఎప్పటి నుండో వినిపిస్తున్నవే..! తాజాగా ‘దంగల్’ నటి కూడా ఈ విషయం పై స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.వివరాల్లోకి వెళితే నటి.. ఫాతిమా సనా షేక్ పై సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నిజ జీవితంలో కూడా దాడి జరిగిందట. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. “గతంలో ఓ సారి నేను జిమ్‌కు వెళ్ళి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి నన్ను అదే పనిగా చూస్తున్నాడు.
తరువాత నన్ను ఫాలో అయ్యాడు.అతను అలా తేడాగా చూస్తుండడంతో.. ‘ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావ్.. ఏం చూస్తున్నావు’ అని అడిగాను. అందుకు అతను ‘నా ఇష్టం నేను చూస్తాను.. నీకెందుకు’ అంటూ రాష్ గా అనడంతో అతని చెంప మీద ఒకటి కొట్టాను. దాంతో అతను కూడా నా మొహం పై గట్టి పంచ్ ఇచ్చాడు. దాంతో నేను క్రింద పడిపోయాను. తరువాత లేచి మా నాన్నగారికి ఫోన్ చేసే లోపు అతను పారిపోయాడు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ తెలిపింది.
‘ఇక సినీ పరిశ్రమలో కూడా నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమంది దర్శకులు పడుకుంటేనే అవకాశాలు ఇస్తామన్నారు. నేను స్ట్రయిట్ గా కుదరదు అని చెప్పడంతో నాకు అవకాశాలు రాకుండా చేశారు.కొంతమంది లొంగదీసుకోవాలని కూడా ట్రై చేశారు. నాకు మూడేళ్ల వయసున్నప్పటి నుండీ ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది ఫాతిమా సనా షేక్.