Actress: నా భర్త కన్నా పెద్దదానిననీ ట్రోల్ చేసేవారు!

  • April 4, 2023 / 09:05 PM IST

సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అవకాశాల కోసం యువతీ యువకులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రమే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్తాయి. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే మరి కొంతమంది మాత్రం కష్టాలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీలో తమకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో పురుషులతో పోల్చితే మహిళలకు ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి.

అవకాశాల కోసం చేసే ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, కమిట్ మెంట్ లాంటి చేదు సంఘటనలను ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఒక బాలీవుడ్ బుల్లితెర నటి తన కెరీర్ లో ఎదుర్కొన్న సమస్యలు అవమానాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నటిగా మంచి గుర్తింపు పొందినప్పటికీ నేను బాడీ షేమింగ్ కు గురైయ్యానని తెలిపారు. నా ఏజ్ పై కూడా ట్రోల్స్ చేశారని, లావుగా ఉన్నానని పలు రకాలుగా విమర్శలు చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన రూపాలీ గంగూలీ ‘అనుపమ’ అనే బుల్లితెర టీవీ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది .

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె (Actress) మాట్లాడుతూ.. అనుపమ షో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా నేను బాడీ షేమింగ్ కు గురయ్యాననీ తెలిపారు. మీ శరీరంపై ముడతలు కనిపిస్తున్నాయి, లావుగా ఉన్నారు అంటూ నన్ను ఎగతాళి చేశారు. అంతే కాకుండా నా భర్త కంటే నేను పెద్దదాన్ని అనే విషయంలో కూడా నాపై ట్రోల్స్ వచ్చాయి అంటూ తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం రూపాలీ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus