Actress: మైండ్ బ్లాక్ చేసిన స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్… మరీ ఇంతలానా?

  • April 6, 2023 / 07:48 PM IST

హిట్ పెయిర్స్.. అన్ని భాషల్లోనూ ఉంటారు. ముఖ్యంగా వారు రొమాంటిక్ సన్నివేశాలతో మరింతగా పాపులర్ అవుతూ ఉంటారు. ఆ లిస్ట్ లో షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ జంట కూడా ఒకటి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’, ‘కభీ అల్విదా నా కెహ్నా’ ‘చల్తే చల్తే’ వంటి సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా.. అప్పటి యూత్ ను ఉర్రూతలూగించింది ఈ జంట. వీళ్ళిద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది.

మొదటి సినిమాకి ఇద్దరి మధ్య మంచి స్నేహం, అనుబంధం ఏర్పడింది. అందుకే వీరిద్దరూ ఇప్పటికీ సన్నిహితంగా ఉంటారు. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ అనే సినిమాలో రాణి ముఖర్జీ నటించింది. తాజాగా రాణి ముఖర్జీతో పాటు ఈ టీం అందరినీ అభినందిస్తూ షారుఖ్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న రాణీ ముఖర్జీ.. షారుఖ్ వేసిన ట్వీట్ గురించి అలాగే షారుఖ్ ఖాన్ గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.

‘రైటర్స్ కు అలాగే డైరెక్టర్స్ కు నేను ఇప్పుడే చెబుతున్నాను. షారుఖ్ కు, నాకు మధ్య ఓ మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ రాయండి,మేము ఇద్దరం కలిసి నటిస్తాము. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే కాదు నాకు షారుఖ్ తో కలిసి నటించడం ఇప్పుడు కూడా ఇష్టమే.

నాకు (Actress) 80 ఏళ్ల వయసొచ్చినా షారుఖ్ తో లవ్ స్టోరీలు చేయడానికి, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది రాణి ముఖర్జీ. ఈమె వయసు ఇప్పుడు 45 ఏళ్ళు కాగా ఈమెకు పెళ్ళై ఓ పాప కూడా ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus