ఆ సినిమాని జనాలు ఇబ్బంది పడుతూనే చూశారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  • November 29, 2023 / 09:13 PM IST

‘సినిమాలు జనాలను ప్రభావితం చేస్తాయా?’ అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ ‘కొంతవరకు అది నిజం’ అని ఒప్పుకోక తప్పదు. విచక్షణ జ్ఞానం లేని కొంతమంది యువతీ యువకులు తాత్కాలికమైన ఆనందం కోసం చెడుకి బానిసలవుతారు. అందుకే ‘యూత్ ని పక్క దోవ పట్టించే విధంగా ఉన్నాయి’ అనే పదాన్ని సమాజం ఎక్కువ సార్లు వాడుతూ ఉంటుంది. నిజ జీవితంలో జరిగే సంఘటనల స్ఫూర్తితో కొన్ని సినిమాల్లో సీన్స్ ను డిజైన్ చేస్తారేమో కానీ..

అది నిజం అని గుడ్డిగా నమ్మేసి ఏది పడితే అది చేసేయకూడదు. ఇలాంటి విషయాలు రాణి ముఖర్జీ వంటి 45 ఏళ్ళ నటికి తెలియంది కాదు. కానీ తాను గతంలో నటించిన ఓ సినిమా వల్ల చాలా మంది విడాకులు తీసుకున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది. విషయం ఏంటంటే.. రాణి ముఖర్జీ ఇటీవల గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది.

ఈ వేడుకలో ఆమె గతంలో చేసిన ‘కభీ అల్విదా నా కెహనా’ అనే సినిమా ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ సినిమాలో రాణీ ముఖర్జీతో పాటు షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రతి జింటా, అమితాబ్ వంటి స్టార్స్ కూడా నటించారు. కరణ్ జోహార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా గురించి రాణీ ముఖర్జీ మాట్లాడుతూ.. “గతంలో వచ్చిన ‘కభీ అల్విదా నా కెహనా’ అనే సినిమా చూసిన తర్వాత చాలా మంది విడాకుల బాట పట్టారు.

ఆ టైమ్ లో ఈ సినిమా ఓ సంచలనమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మూవీని ప్రేక్షకులు థియేటర్లలో కాస్త అసౌకర్యంగానే చూశారు. అలాగే ఈ సినిమా చాలా మంది కళ్లు తెరిపించింది అని చెప్పాలి. సంతోషంగా ఉండటం చాలా ముఖ్యమని గ్రహించిన చాలా మంది సింగిల్ లైఫ్ కోసం విడాకులు తీసుకున్నారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. (Rani Mukerji) ఈమె కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus