Actress: పబ్బుకి, నైట్ పార్టీలకు వచ్చినట్టు వచ్చావ్..ఇది బద్ధకం తప్ప ఇంకేం కాదు!
May 27, 2023 / 12:00 PM IST
|Follow Us
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కంగనా మంచి మంచి కథలు, మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుని తన నటనతో మంచి హిట్లు అందుకోగలదు. తెలుగులో ఈ భామ ప్రభాస్ – పూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించింది. దాని తర్వాత మరే మూవీలోనూ కంగనా నటించలేదు. ఇక సినిమాలతో కంటే కూడా వివాదాలతో కంగనా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుందన్న సంగతి తెలిసిందే.
ఈమె టంగ్ పవర్ కు బాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు (Actress) అంతా కూడా షేక్ అవుతారు. ఈమె ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. కాబట్టి ఈమె మాట్లాడింది వినడానికి,యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందని చెప్పాలి. సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కూడా ఈమె స్పందిస్తూ ఉంటుంది. తాజాగా కంగనా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాలోని బైజ్ నాథ్ ఆలయంలోకి ఒక అమ్మాయి లో దుస్తుల్లో వెళ్ళింది. ఈ ఫోటోలు చూసిన కంగనా రనౌత్ ఫైర్ అయింది. ‘అవివేకి.. మూర్ఖురాలు.. సోమరిపోతు. ఇవి పాశ్చాత్య దుస్తులు. తెల్ల దొరలు కనుగొన్నారు. క్యాజువల్స్ లాగా నైట్ డ్రెస్‌లు వేసుకుని గుడికి వచ్చే ఈ దుర్మార్గులది బద్ధకం తప్ప ఇంకేం కాదు.
ఇలాంటి మూర్ఖుల కోసం కఠినమైన రూల్స్ ఉండాలి. పబ్ లేదా నైట్ క్లబ్‌కు వెళ్లినట్లుగా బైజ్ నాథ్ ఆలయానికి రావడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఒకప్పుడు షార్ట్, టీ-షర్ట్ ధరించినందుకు నన్ను ఆలయ ప్రాంగణంలోకి కూడా రాలేదు. తిరిగి వెళ్లిపోయాను’ అంటూ మండిపడింది కంగనా.