NTR, Charan: ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ హీరో అనే సంగతి తెలీదంటున్న హీరోయిన్స్..!

  • June 27, 2023 / 12:26 PM IST

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్.. లు హీరోలుగా నటిస్తున్నారు అని రివీల్ చేసినప్పుడే భారీ హైప్ ఏర్పడింది. దానిని నిజం చేస్తూ దేశ, విదేశాల్లో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సత్తా చాటిన సంగతి తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు అయితే ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ పాటలో ఎన్టీఆర్ , రాంచరణ్ డాన్స్ మూమెంట్స్ కి ఫిదా కాని వారు అంటూ ఉండరు.

అలాగే రాంచరణ్ .. అల్లూరి సీతారామరాజు పాత్రలో, (NTR) ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో.. ఇద్దరూ కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. దర్శకుడు రాజమౌళి ఎవ్వరినీ తక్కువ చేయలేదు. కానీ కొంతమంది ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేస్తూ మాట్లాడుతుంటారు. ఈ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే..! టాలీవుడ్ సీనియర్ దర్శకుడు నీలకంఠ ‘సర్కిల్’ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో సాయి రోనక్, హీరోగా నటించగా అర్షిణ్‌ మెహతా,రిచా పనై హీరోయిన్లుగా నటించారు.

జూలై 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ లో అర్షిణ్ మెహతా, రిచా పనై పాల్గొన్నారు. ‘సర్కిల్’ గురించి గొప్పగా చెబుతూనే టాలీవుడ్ గురించి స్పందించారు. రిచా పనై.. గతంలో అల్లరి నరేష్ తో ‘యముడికి మొగుడు’ అనే సినిమాలో నటించింది. అర్షిణ్ మెహతా కి ఇదే మొదటి సినిమా. అయితే వీరు ‘సర్కిల్’ ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ గురించి స్పందించారు.

ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి గొప్పగా మాట్లాడారు. కానీ ఇందులో హీరోల ప్రస్తావన తీసుకురాగా వీరికి రాంచరణ్ మాత్రమే హీరో అని తెలుసట. ఎన్టీఆర్ హీరో అని ప్రత్యేకంగా తెలీదు అన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి వార్తల్లో నిలిచింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus