ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పలువురు టీవీ ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమీరా భర్త తన పోస్ట్ లో ఎంతో ఎమోషనల్ గా రాసుకొచ్చారు. సెప్టెంబర్ 4న తమకు మగబిడ్డ జన్మించాడని.. ఇవి తమ జీవితంలో బెస్ట్ మూమెంట్స్ అని పేర్కొన్నారు. దయచేసి ఈ పోస్ట్ పై ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.
ఇక సమీరా ‘ఆడపిల్ల’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సీరియల్ సక్సెస్ కావడంతో సమీరాకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ‘అన్నా చెల్లెల్లు’, ‘భార్యామణి’, ‘Dr. చక్రవర్తి’, ముద్దుబిడ్డ’ ఇలా చాలా సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా నటుడు ప్రభాకర్ తో కలిసి ఎన్నో సీరియల్స్ లో నటించింది. నటిగా నిరూపించుకున్న సమీరా.. ఆ తరువాత నిర్మాతగా మారి తమిళంలో సీరియల్స్ కూడా నిర్మిస్తోంది.
కొన్ని సీరియల్స్ లో ఆమె నటించింది కూడా. కొన్నాళ్లక్రితం జీ తెలుగులో ప్రసారమైన ‘అదిరింది’ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించింది. ఆ తరువాత బుల్లితెరకు దూరమైంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!